Health tips: మధ్య వయస్సులోనే ఎముకలు, కీళ్లు అరిగిపోతున్నాయా.. ఈ ఆహారంతో ఆ సమస్యలకు చెక్ పెట్టేయ్యొచ్చు..
సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాల క్షీణతను తగ్గించవచ్చు. ఎముకలు, కండరాల ఆరోగ్యానికి సంబంధించి కాల్షియం అత్యంత ముఖ్యమైన పోషకాహారాల్లో ఒకటి. తగినంత కాల్షియం తీసుకోవడం వల్ల
Health tips: వృద్ధాప్యంలో ఎముకలు, కీళ్లు అరిగిపోవడం సాధారణంగా చూస్తుంటాం.. కాని నేటి ఆధునిక కాలంలో మధ్య వయస్సులోనే చాలా మంది ఎముకలు, కీళ్ల సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా కల్షియం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడంతో ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. మధ్య వయసులోనే ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధుల బారినపడటంతో వ్యక్తుల జీవితకాలం తగ్గిపోవడానికి ఇవి కారణమవుతున్నాయి. అలాగే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాల క్షీణతను తగ్గించవచ్చు. ఎముకలు, కండరాల ఆరోగ్యానికి సంబంధించి కాల్షియం అత్యంత ముఖ్యమైన పోషకాహారాల్లో ఒకటి. తగినంత కాల్షియం తీసుకోవడం వల్ల మన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మధ్య వయస్సులో ఉన్న మెరుగైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎముకులు, కీళ్లు త్వరగా అరిగిపోకుండా చూసుకోవచ్చు. ఎక్కువ కాల్షియం ఉండే ఆహార పదార్థాలు ఎంటో చూద్దాం.. 1. సోయాబీన్స్ : శాఖాహరులు కాల్షియం ఉన్న పదార్థాలను తీసుకోవాలంటూ టోఫుని తినవచ్చు. దీనినే బీన్ పెరుగు అని కూడా అంటారు. టోఫులో కొలెస్ట్రాల్ ఉండదు, సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇతర సోయా బీన్స్ పదార్థాలైన టేంపే, సోయా పాలు వంటి వాటిలో కాల్షియం, విటమిన్ D ఎక్కువుగా ఉంటాయి.
2. ఆకుపచ్చని కూరగాయలు : గ్రీన్ లీఫ్ వెబిటేబుల్స్ గా పిలిచే క్రూసిఫెరస్ కూరగాయల్లో పోషకాలు ఎక్కువుగా ఉంటాయి. వీటిలో పాలకూర, బచ్చలికూర, క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను ఆహారంతో తీసుకోవడం ద్వారా మన ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి.
3. పాల ఉత్పత్తులు: పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలుంటాయి. పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు శరీరంలోని ఎముకులు ధృడంగా ఉండేందుకు దోహదపడతాయి. పాల ఉత్పత్తులను రోజువారి ఆహారంతో తీసుకోవడం ఎంతైనా మేలు.
4. జిడ్డుగల చేప: వీటినే ఫ్యాటీ ఫిష్ అంటారు. సాల్మన్, ట్యూనా, హిల్సా వంటి కొవ్వు చేపలలో కాల్షియం, విటమిన్ డి మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
5. బాదం: సాధారణంగా నట్స్‌లో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్, కాల్షియం ఎక్కువుగా ఉండే వాటిలో బాదంపప్పు ఒకటి. ఇవి మన ఎముకలు, కండరాలు, కీళ్ల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
6. గుడ్లు: కోడి గుడ్లలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుడ్డులో తెల్లగా ఉండే పదార్థమే కాకుండా.. మొత్తం గుడ్డు తినడం మంచిది.
7. విత్తనాలు: చియా గింజలు, గసగసాలు, సెలెరీ వంటి పదార్థాల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఈపదార్థాలు ఎముకలు బలంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. చియా గింజల్లో ఉండే ఖనిజ బోరాన్ ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది.
రోజూవారీ ఆహారంలో పైన తెలిపిన పదార్థాలను తీసుకుంటే మధ్య వయస్సులో వారు ఎముకులు, కీళ్లు బలంగా ఉండే అవకాశం ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..