Asthma: అస్తమా ఉన్న పిల్లలు కరోనా బారిన పడితే ప్రమాదమే.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు..!

|

Dec 04, 2021 | 3:20 PM

Asthma: గత ఏడాదికిపైగా విజృంభించి తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. వివిధ వేరియంట్లుగా పుట్టుకొచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా సౌతాఫ్రికాలో బయటపడ్డ..

Asthma: అస్తమా ఉన్న పిల్లలు కరోనా బారిన పడితే ప్రమాదమే.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు..!
Follow us on

Asthma: గత ఏడాదికిపైగా విజృంభించి తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. వివిధ వేరియంట్లుగా పుట్టుకొచ్చి మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ మళ్లీ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఆస్తమా ఉన్న పిల్లలకు కరోనా సోకితే ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై స్కాట్లాండ్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్తమా ఉన్న పిల్లలకు కోవిడ్‌ సోకినట్లయితే కోలుకునే అవకాశాలు చాలా తక్కువ అని అధ్యయనం ద్వారా తేల్చారు. ఒక వేళ కరోనా లక్షణాలు కనిపించినట్లయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లయితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు. మిగతా పిల్లలతో పోలిస్తే ఆస్తమా ఉన్న పిల్లలకు రోగనిరోధక శక్తి చాలా తక్కువ. ఇంగ్లండ్‌లోని 5 నుంచి 17 ఏళ్ల లోపు ఏడున్నర లక్షల మంది పిల్లలపై ఈ పరిశోధన నిర్వహించారు శాస్త్రవేత్తలు. ఈ అధ్యయన ఫలితాలను ‘ది లాన్సెట్‌ రెస్పిరేటరీ మెడిసిన్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. ఆస్తమా ఉన్న 380 మంది పిల్లల్లో ఒక్కరు మాత్రమే త్వరగా కోలుకున్నారని, మిగతా పిల్లల పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని గుర్తించారు.

అయితే అధ్యయనం ప్రకారం.. ఈ అస్తమా 3 నుంచి 38 శాతం పిల్లలను, 2 నుంచి 12 శాతం పెద్దలను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. భారతదేశంలో 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఆస్తమా ప్రాబల్యం 2.05 శాతం ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇక అస్తమా ఉన్న వారు ఆహార నియమాలు పాటించడం వల్ల మెరుగుపర్చుకోవచ్చు.తాజా పండ్లు, కూరగాయలను కలిగి ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Baby teeth: పిల్లల్లో పాల దంతాలు ఊడిపోవడానికి కారణం ఏమిటి..? ఇది దేనికి సంకేతం..!

Heart Disease: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమయానికే నిద్రించాలి.. తాజా పరిశోధనలలో కీలక అంశాలు..!

Amla Health Benefits: ఉసిరితో అద్భుతమైన ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..!

Walking Calories: నడకతో ఎలాంటి ఉపయోగాలున్నాయి..? వాకింగ్ వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి..?