AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక హగ్ చేసే మ్యాజిక్ మీరు ఊహించలేరు..! ఆరోగ్యం, ఆనందం రెండూ మీ సొంతం అవుతాయి..!

ఒక్క ప్రేమతో కూడిన హగ్.. మానసిక, శారీరక ఆరోగ్యానికి నిజంగా మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇది కేవలం ప్రేమను చూపడం మాత్రమే కాదు.. మన హార్మోన్‌ లను స్టిములేట్ చేసి స్ట్రెస్, బీపీ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. హగ్ ద్వారా హెల్త్ ఎలా మెరుగుపడుతుందో.. ఆ అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక హగ్ చేసే మ్యాజిక్ మీరు ఊహించలేరు..! ఆరోగ్యం, ఆనందం రెండూ మీ సొంతం అవుతాయి..!
Hug Benefits
Prashanthi V
|

Updated on: Jul 17, 2025 | 9:15 PM

Share

ఒక నార్మల్ హగ్.. ఇది కేవలం ప్రేమను చూపే మార్గం మాత్రమే కాదు.. బాడీని, మైండ్‌ను హెల్దీగా ఉంచే ఒక పవర్‌ఫుల్ టూల్ కూడా. లవ్‌డ్ వన్‌ని నిమిషాలపాటు హత్తుకున్నప్పుడు.. బాడీలో బోలెడు హార్మోన్లు రిలీజ్ అవుతాయి. వీటి వల్ల మన ఫిజికల్, మెంటల్ హెల్త్ సూపర్ స్ట్రాంగ్‌ గా మారుతుంది. ముఖ్యంగా మన లవ్‌డ్ వన్‌ని నిమిషాలపాటు హత్తుకున్నప్పుడు ఈ బెనిఫిట్స్ క్లియర్‌గా కనిపిస్తాయి.

హార్ట్ బీట్ కంట్రోల్

మన ప్రియమైన వ్యక్తిని హత్తుకున్నప్పుడు.. బాడీలో వేగస్ నర్వ్ యాక్టివ్ అవుతుంది. దీని ఎఫెక్ట్‌ తో హార్ట్ బీట్ స్లో అవుతుంది. బాడీ ప్రశాంతంగా మారుతుంది. దీని వల్ల బ్లడ్ ప్రెషర్ స్టేబుల్‌ గా ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్లకి ఇది ఒక నాచురల్ రిలీఫ్ లా పనిచేస్తుంది.

లవ్ హార్మోన్

హగ్ చేసుకున్న కొన్ని క్షణాలకే బాడీ ఆక్సిటోసిన్ అనే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది మనలో నమ్మకాన్ని, బంధాన్ని పెంచేలా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రేమ, అటాచ్‌మెంట్ డీప్‌గా స్ట్రాంగ్ అవ్వడానికి ఆక్సిటోసిన్ చాలా అవసరం. అందుకే హగ్ తర్వాత మనలో సంతోషం, ప్రశాంతత వెల్లివిరుస్తుంది.

స్ట్రెస్‌ను తగ్గించడంలో సపోర్ట్

హగ్‌తో గుండెల్లో శాంతి కలిగితే.. మన బాడీలోని కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్ తగ్గుతుంది. కష్టపడి గడిపిన రోజుల్లో.. ఒక చిన్న హగ్ కూడా మనం రిలీఫ్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. మైండ్ టెన్షన్‌గా ఉన్నప్పుడు ప్రేమతో లవ్‌డ్ వన్‌ని నిమిషాలపాటు హత్తుకున్నప్పుడు ఎందుకు ప్రశాంతంగా అనిపిస్తుందంటే.. అసలు కారణం ఇదే.

పెయిన్ రిలీఫ్

మన బాడీలో ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి నాచురల్ పెయిన్ కిల్లర్స్ లాగా పనిచేస్తాయి. తలనొప్పి, బాడీ పెయిన్స్ లాంటి చిన్న చిన్న నొప్పులు కూడా హగ్ వల్ల తగ్గిపోతాయి. ఎమోషనల్‌ గా లో ఫీల్ అయినప్పుడు లేదా ఫిజికల్‌ గా అనీజీగా ఉన్నప్పుడు ఒక మంచి ఆలింగనం ఎంతో రిలీఫ్ ఇస్తుంది.

ఇమ్యూనిటీ సిస్టమ్‌కు పవర్

హగ్ వల్ల బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ (తెల్ల రక్తకణాలు) ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి బాడీని వ్యాధుల నుంచి కాపాడే సెల్స్. అందుకే ప్రేమగా, అటాచ్‌మెంట్‌తో జీవించేవాళ్లు హెల్దీగా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

ఒక నార్మల్ హగ్ వల్ల కలిగే బెనిఫిట్స్ షాకింగ్‌గా ఉంటాయి. ఇది కేవలం ఒక ఎమోషనల్ రెస్పాన్స్ మాత్రమే కాదు.. ఇది మన హెల్త్‌ను కాపాడే ఒక పవర్‌ఫుల్ టూల్ కూడా. ప్రతిరోజూ మీ పార్ట్‌నర్‌ని ప్రేమగా హత్తుకోండి. మీ బాడీకి, మైండ్‌కి అది ఒక చిన్న మ్యాజికల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.