Hair Tips: గురివింద గింజలను ఇలా వాడితే.. మీ జుట్టు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరు

ఈ రోజుల్లో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. అందుకు రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. పొల్యూషన్, చుండ్రు, రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలు వాడటం, హెయిర్ స్ట్రైటర్లు, కల్తీ చేయబడిన నూనెల్ని వాడటం.. ఇలా చాలా మంది జుట్టు రాలే సమస్యతో సతమతమవుతున్నారు. అలాంటి వారందరికీ.. ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. జుట్టు పెరగటమే కాదు.. నల్లగా, ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అందుకు ప్రధానంగా కావాలసినవి..

Hair Tips: గురివింద గింజలను ఇలా వాడితే.. మీ జుట్టు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరు
Rosary Pea Benefits
Follow us

|

Updated on: Aug 01, 2023 | 2:47 PM

ఈ రోజుల్లో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. అందుకు రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. పొల్యూషన్, చుండ్రు, రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలు వాడటం, హెయిర్ స్ట్రైటర్లు, కల్తీ చేయబడిన నూనెల్ని వాడటం.. ఇలా చాలా మంది జుట్టు రాలే సమస్యతో సతమతమవుతున్నారు. అలాంటి వారందరికీ.. ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. జుట్టు పెరగటమే కాదు.. నల్లగా, ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అందుకు ప్రధానంగా కావాలసినవి గురివింద గింజలు. వీటితో జుట్టును పెంచే ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం.

పట్టణాలు, నగరాల్లో అయితే ఇవి మచ్చుకైనా కనిపించకపోవచ్చు కానీ.. పల్లెటూళ్లలో పొలాలు, చేల కంచెల వెంబడి ఈ గింజలు విరివిగా లభిస్తుంటాయి. లేదంటే ఆయుర్వేదం షాపుల్లోనూ వీటిని కొనుగోలు చేయొచ్చు. చూడటానికి ఎరుపు, నలుపు రంగులతో చిన్నగా కనిపించే ఈ గింజలను ఉపయోగించి జుట్టు సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

-రివింద గింజలను ఒక జార్ లో వేసి.. కచ్చాపచ్చాగా ఉండేలా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక మందపాటి వస్త్రంలో వేసి మూట కట్టాలి. ఒక గిన్నెలో అరగ్లాసు పాలను తీసుకుని అందులో గురివింద గింజల మూటవేసి పాలు పూర్తిగా ఆవిరయ్యేంతవరకూ మరిగించాలి. తర్వాత మూటను పక్కకు తీసి ఉంచాలి.

ఇవి కూడా చదవండి

మరో గిన్నెలో 100 గ్రాముల కొబ్బరినూనెను తీసుకుని ఒక టీ స్పూన్ గుంటగలగరాకు పొడి వేసి కలపాలి. పాలలో ఉడికించిన గురివింద గింజల పప్పును నూనెలో వేసి చిన్న మంటపై మరిగించాలి. ఇలా మరిగించిన నూనెను వడకట్టి నిల్వచేసుకోవాలి.

రాత్రి పడుకునే ముందు ఈ నూనెను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే కుంకుడుకాయ లేదా షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి కనీసం రెండు-మూడు సార్లైనా చేస్తే జుట్టు రాలడం తగ్గి.. నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు, దురద సమస్యలు కూడా ఉండవు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి