AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Pollution: వాయు కాలుష్యంతో పొంచి ఉన్న చర్మ వ్యాధుల ముప్పు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

బయటికి వెళ్లాలంటేనే భయం వేసే పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఎంత ఓవైపు.. మితిమీరిన వాయు కాలుష్యం మరోవైపు. వీటి వల్ల శ్వాసకోస వ్యాధులతోపాటు చర్మ వ్యాధులు కూడా ప్రభలుతున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Air Pollution: వాయు కాలుష్యంతో పొంచి ఉన్న చర్మ వ్యాధుల ముప్పు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Air Pollution
Srilakshmi C
|

Updated on: Nov 25, 2024 | 8:30 AM

Share

ఢిల్లీతోపాటు పలు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. AQI 400 మించి ఉంది. కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అయితే ఈ కాలుష్యం చర్మంపై కూడా ప్రభావం చూపుతుంది. కాలుష్యం కారణంగా చర్మంపై వాపు, దురద, దద్దుర్లు, నల్ల మచ్చలు వంటివి వస్తాయి. ఇలాంటి మీ చర్మంపై కూడా వస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. కాలుష్యం వల్ల వచ్చే చర్మవ్యాధుల ప్రారంభ లక్షణాలు ఇవి. కాలుష్యం వల్ల ఏయే చర్మ వ్యాధులు వస్తాయో? వాటిని ఎలా నివారించవచ్చో? ఈ కింద తెలుసుకుందాం..

కాలుష్యం వల్ల అనేక రకాల చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఢిల్లీలోని పీఎస్ ఆర్ ఐ హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ భావుక్ ధీర్ చెబుతున్నారు. కాలుష్యం ఎగ్జిమా అనే చర్మ వ్యాధిని కలిగిస్తుంది. దీని వల్ల చర్మంలో వాపు, దురద ఉంటుంది. కాలుష్యం వల్ల చర్మంపై మొటిమల సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల చర్మంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడవచ్చు. కొంతమందికి చర్మంపై పిగ్మెంటేషన్ సమస్యలు, దురద కూడా ఉండవచ్చు. ఈ సమస్యలన్నీ ప్రారంభంలో చాలా తేలికగా అనిపించినా, క్రమంగా సమస్యలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ప్రారంభంలోనే వీటిని గుర్తించి, చికిత్స తీసుకోవడం అవసరం.

కాలుష్యం చర్మాన్ని ఎలా దెబ్బతీస్తుంది?

కాలుష్యంలో ఉండే కణాలు చర్మంతో కలిసిపోయి అక్కడే స్థిరపడతాయని డాక్టర్ ధీర్ హెచ్చరిస్తున్నారు. కాలుష్యం వల్ల వచ్చే దుమ్ము, మట్టిలో PM2.5 చిన్న రేణువులు ఉంటాయి. ఇది చర్మానికి హాని చేస్తుంది. ఎక్కువ సమయం బయట ఉండే వారికి కాలుష్యం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ.

ఇవి కూడా చదవండి

కాలుష్యం నుండి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలి?

  • చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచాలి. దీని కోసం రోజుకు కనీసం 6 నుండి 7 గ్లాసుల నీరు త్రాగాలి.
  • చర్మంపై వాపు, ఎరుపు గుర్తులు లేదా దద్దుర్లు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
  • మాస్క్ ధరించడం వల్ల చర్మానికి కూడా రక్షణ లభిస్తుంది. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి.
  • ఎల్లప్పుడూ చర్మాన్ని శుభ్రంగా ఉంచకోవాలి. మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సన్‌స్క్రీన్‌ను క్రమం తప్పకుండా అప్లై చేయాలి.
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా కాలుష్య ప్రభావాలను తగ్గించవచ్చు. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి.
  • బయటకు వెళ్లేటప్పుడు ముఖాన్ని స్కార్ఫ్‌తో కప్పుకోవాలి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.