
ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు విరిగి పోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారిన జీవన విధానం, పోషకాహార లోపం వల్ల జుట్టుకు సరైన విధంగా పోషణ అందండం లేదు. దీంతో జుట్టు బలహీనంగా తయారై.. రాలడం జరుగుతుంది. దానికి తోడు ఇప్పుడున్న లైఫ్ లో ఒత్తిడిని కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టుపై ఎఫెక్ట్ పడుతుంది. ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలని.. మార్కెట్ లో లభించే వివిధ రకాల ప్రాడెక్ట్స్ ని వాడుతూ ఉంటారు.
అయితే చాలా మందికి వాటితో కూడా మంచి ఫలితాలు అందడం లేదు. కానీ ఇప్పుడు చెప్పే ఆయిల్ ని ఉపయోగిస్తే.. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగి.. నల్లగా మారుతుంది. ఈ ఆయిల్ ని ఎక్కువగా కేరళీయులు ఉపయోగిస్తారు. మరి ఈ ఆయిల్ ను ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి 500 ఎమ్ఎల్ కొబ్బరి నూనె, గుప్పెడు కరివేపాకు, నాలుగు గంటల పాటు నాన బెట్టిన మెంతులు, రెండు టేబుల్ స్పూన్ల మందార ఆకుల పొడి, కొద్దిగా కలబంద గుజ్జు, 10 చిన్న ఉల్లి పాయలు, 10 మిరియాలు.
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో.. ఉల్లి పాయలు, కరివేపాకు, మెంతులు, మందార ఆకుల పొడి, కలబంద గుజ్జును వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఈపేస్ట్ వేసు కోవాలి. ఆ తర్వాత కొబ్బరి నూనె కూడా వేసి ఓ 10 నిమిషాల పాటు మరిగించు కోవాలి. తర్వాత మిరియాలు కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసు కోవాలి. ఇలా మరిగిన ఆయిల్ ని వడకట్టి.. బాగా చల్లార్చు కోవాలి. దీన్ని వడకట్టి.. ఓ గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె గోరు వెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్లకు బాగా పట్టించాలి. కావాలనుకుంటే అరగంట ముందు ఆయిల్ పెట్టి.. తలస్నానం చేసుకోవచ్చు. ఇలా చేస్తే జుట్టుకు సంబంధించిన సమస్యలు అన్నీ పోతాయి.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.