Bones Strong Tips: నాన్ వెజ్ తినకుండానే.. ఎముకలను స్ట్రాంగ్ చేసుకోండిలా!

మనం ఏ పని చేయాలన్నా ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. శరీర ఆరోగ్యం కాపాడుకోవాలంటే.. అంతా మన చేతుల్లోనే ఉంది. సరైన జీవన శైలి, ఆహారం తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఎటాక్ చేయకుండా ఉంటాయి. ఎముకలు బలంగా ఉంటే శరీరక ఎదుగుదల కూడా బాగుంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎముకలు బలంగా ఉండాలంటే చాలా మంది నాన్ వెజ్ తింటే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఎముకలు బలంగా ఉండాలంటే..

Bones Strong Tips: నాన్ వెజ్ తినకుండానే.. ఎముకలను స్ట్రాంగ్ చేసుకోండిలా!
Bones

Edited By:

Updated on: Jan 09, 2024 | 7:04 PM

మనం ఏ పని చేయాలన్నా ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. శరీర ఆరోగ్యం కాపాడుకోవాలంటే.. అంతా మన చేతుల్లోనే ఉంది. సరైన జీవన శైలి, ఆహారం తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఎటాక్ చేయకుండా ఉంటాయి. ఎముకలు బలంగా ఉంటే శరీరక ఎదుగుదల కూడా బాగుంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎముకలు బలంగా ఉండాలంటే చాలా మంది నాన్ వెజ్ తింటే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఎముకలు బలంగా ఉండాలంటే నాన్ వెజ్ అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి నాన్ వెజ్ కాకుండా ఇతర ఆహారాలు ఏం తింటే ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయో ఇప్పుడ చూద్దాం.

రాగులు:

రాగుల్లో కాల్షియం అధికంగా అందుతుంది. రాగులతో తయారు చేసే ఆహారం తీసుకోవడం వల్ల ఎముకలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇది పిల్లలకు మంచి ఫుడ్ గా చెప్పొచ్చు. రాగుల్లో విటమిన్ డి అనేది పుష్కలంగా అందుతుంది. రాగుల్లో విటమిన్ డి, కాల్షియం ఉండటం వల్ల ఎముకలు అనేవి బలంగా ఉంటాయి.

బచ్చలి కూర:

బచ్చలి కూరలో కూడా కాల్షియం మెండుగా ఉంటుంది. వెజ్ తినేవారు ఎముకలు బలంగా ఉండాలంటే మీ డైట్ లో బచ్చలి కూరను యాడ్ చేసుకోండి. బచ్చలి కూరలో కాల్షియం 25 శాతం, ఐరన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

జున్ను:

జున్నులో కూడా కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. ఎముకలు బలహీనంగా ఉండే వాల్లు జున్ను తినడం వల్ల బలంగా మారతాయి. జున్నులో ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. పిల్లలు కూడా హ్యాపీగా తినవచ్చు.

టోపు:

మీ ఆహారంలో టోపు కూడా యాడ్ చేసుకోవడం వల్ల శరీరంలోని అనేక పోషకాల లోపాల్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రోటీన్లు, ఇతర పోషకాలు అందుతాయి. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

పాలు – పెరుగు:

ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాలు, పెరుగు తీసుకుంటే.. ఎముకలు ఎంతో దృఢంగా ఉంటాయి. అదే విధంగా పలు పోషకాలు కూడా అందుతాయి. ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.