AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తాయి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

మన రక్తంలో ఉండే కొవ్వుల సమతుల్యత మన గుండె ఆరోగ్యాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో చాలా మందికి తెలియదు. మంచి కొవ్వు, చెడు కొవ్వు, ట్రైగ్లిసరైడ్స్ అనే మూడు రకాల కొవ్వులలో మన ఆరోగ్యానికి ఏవి మేలు చేస్తాయి..? ఏవి హాని కలిగిస్తాయి..? వాటిని ఎలా సమతుల్యం చేయాలి..? ఈ విషయాలపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తాయి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
Heart Healthy
Prashanthi V
|

Updated on: Jun 15, 2025 | 9:36 PM

Share

చాలా మందికి కొలెస్ట్రాల్ అనే పదం వింటే భయంగా ఉంటుంది. కానీ ఇది అంత నిజం కాదు. శరీరంలో కొవ్వులు అవసరమైనవే. అవి శరీరంలో తగిన మోతాదులో ఉంటే ఆరోగ్యానికి మంచిది. మన శరీరంలో హార్మోన్లు తయారవడం, కణాల నిర్మాణం, జీర్ణక్రియ వంటి అనేక పనుల్లో కొలెస్ట్రాల్ కీలక పాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్‌ లిపోప్రొటీన్ల రూపంలో రక్తంలో ప్రయాణిస్తుంది. వీటిలో మూడు ముఖ్యమైన రకాలు ఉంటాయి — LDL, HDL, ట్రైగ్లిసరైడ్లు.

LDL (చెడు కొవ్వు)

LDL అంటే Low Density Lipoprotein. ఇది శరీరంలోని వివిధ భాగాలకు కొవ్వులను తీసుకెళ్లే పనిని చేస్తుంది. కానీ ఇది ఎక్కువైతే రక్తనాళాలలో చెడు మార్పులు వస్తాయి. ఇవి నాళాల గోడలపై ప్లాక్ పేరుకుపోయి నాళాలను ఇరుకుగా చేస్తాయి. దీని వల్ల రక్తప్రవాహం ఆగిపోతుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి దీన్ని నియంత్రించుకోవాలి.

HDL (మంచి కొవ్వు)

HDL అంటే High Density Lipoprotein. ఇది చెడు కొవ్వును శరీరం నుండి బయటకు తీసుకెళ్లి కాలేయానికి పంపుతుంది. అందుకే దీనిని మంచి కొవ్వుగా భావిస్తారు. దీని స్థాయి ఎక్కువగా ఉండటం గుండెను కాపాడటంలో సహాయపడుతుంది. అయితే ఏ కొవ్వు అయినా తగిన మోతాదులో ఉండాలి. ఎక్కువ అయితే మంచిదన్న భావన తప్పు. దీని పనితీరు ముఖ్యం.

ట్రైగ్లిసరైడ్స్

కార్బోహైడ్రేట్లు, షుగర్ లాంటి పదార్థాలను శరీరం సరిగ్గా ఉపయోగించకపోతే అవి ట్రైగ్లిసరైడ్స్ గా మారి నిల్వ ఉంటాయి. ఇవి కూడా ఎక్కువగా ఉంటే రక్తనాళాల్లో అదుపు తప్పే అవకాశం ఉంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.

గుండె జబ్బులకు సంబంధించి LDL (చెడు కొవ్వు) ముఖ్యమైన ముప్పుగా పరిగణించబడుతుంది. ఇది రక్త నాళాలలో పేరుకుపోయి అడ్డంకులకు దారితీస్తుంది. అయితే ట్రైగ్లిసరైడ్లు రహస్య శత్రువు అని చెప్పొచ్చు. ఇవి కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. శరీరానికి సహాయపడే HDL (మంచి కొవ్వు) తగినంత స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఇది రక్తనాళాల నుండి చెడు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ మూడు రకాల కొవ్వుల స్థాయిలను సమతుల్యంగా ఉంచుకోవడం అవసరం.

ఆరోగ్యకరమైన కొవ్వుల స్థాయి ఎంత ఉండాలి..?

  • LDL – 100 mg/dL కంటే తక్కువగా ఉండాలి
  • HDL – 60 mg/dL కంటే ఎక్కువగా ఉండాలి
  • ట్రైగ్లిసరైడ్స్ – 150 mg/dL కంటే తక్కువగా ఉండాలి

అయితే ఈ కొవ్వుల స్థాయిలు వ్యక్తి వయసు, లింగం, కుటుంబ చరిత్ర, ఇతర ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా మారవచ్చని గుర్తుంచుకోవాలి. కాబట్టి మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి తగిన సూచనల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

అసమతుల్య కొవ్వులకి కారణాలు

  • ఎక్కువ మాంసాహారాన్ని, వేయించిన పదార్థాలను తినడం
  • బేకరీ ఐటెమ్స్, షుగర్ ఎక్కువగా ఉండే స్నాక్స్ తీసుకోవడం
  • శారీరక శ్రమ లేని జీవనశైలి
  • ధూమపానం – HDL స్థాయిని తగ్గిస్తుంది
  • మద్యం అధికంగా తాగడం – ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి
  • మానసిక ఒత్తిడి – హార్మోన్ల మార్పులతో కొవ్వు పెరగడం
  • వంశపారంపర్య కారణాలు

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • రోజూ కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం
  • ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం
  • తీపి పదార్థాలను తగ్గించడం
  • ధూమపానం మానేయడం
  • మద్యం తక్కువగా లేదా పూర్తిగా మానేయడం
  • ధ్యానం, మానసిక ప్రశాంతత కలిగించే అలవాట్లు

కొన్నిసార్లు జీవనశైలి మార్పులు సరిపోనప్పుడు వైద్యులు స్టాటిన్ వంటి మందులను సూచించవచ్చు. ఇవి ముఖ్యంగా LDL (చెడు కొవ్వు) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ మందులను ఎల్లప్పుడూ వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?