Sprouts Health Benefits: గుండె ఆరోగ్యం నుండి చర్మ సౌందర్యం వరకు మొలకలతో ఇంకా ఎన్నో లాభాలు..!
మొలకలలో ఉండే పోషకాలు మన శరీరాన్ని ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మొలకల్లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే వీటిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి మొలకలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.

మొలకలు కేవలం గుండెకు మాత్రమే కాదు.. శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్, ఫైబర్, ఖనిజాలు, అనేక ఎంజైమ్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ కలిపి మొలకలను సూపర్ ఫుడ్ జాబితాలో చేర్చాయి. వీటిలోని ఫైబర్ శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తూ ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా సహాయపడుతుంది. దీని వల్ల కడుపులో ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు సులభంగా తగ్గిపోతాయి.
మొలకల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి సహాయపడతాయి. ఇవి శరీరం లోపల ఉన్న కణాలను ఆరోగ్యంగా కాపాడుతూ కొత్త కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. కొల్లాజెన్ వల్ల చర్మం నిబ్బరంగా మెరుగైన రీతిలో ఉంటుంది. అందుకే మొలకలు చర్మ యవ్వనాన్ని కాపాడటానికి చాలా అవసరమైనవి.
మొలకల్లో అధికంగా ఉండే విటమిన్ C మన రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీని వల్ల శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు నిరోధకంగా మారుతుంది. సీజనల్ ఫ్లూ, కఫం, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఒక విధంగా విటమిన్ C శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
మొలకల్లో ఉండే ఫోలేట్, విటమిన్ K మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. ఫోలేట్ మానసిక శక్తిని పెంచి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ K రక్త కణాల ద్వారా రక్త ప్రసరణకు సహాయపడటం వల్ల మెదడులో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. వీటి కారణంగా మన మెదడు చురుకుగా, జాగ్రత్తగా పని చేస్తుంది.
మొలకల్లోని పోషకాల వల్ల శరీరం ఆరోగ్యవంతంగా ఉండటమే కాక మానసిక శాంతి, శక్తి, ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పడటానికి కూడా సహకరిస్తుంది. మీ రోజువారీ ఆహారంలో మొలకలను చేర్చుకోవడం వల్ల మీరు శరీరానికి కావాల్సిన పలు ముఖ్యమైన పోషకాలను సులభంగా అందించుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




