ఒక్క హగ్ తో మనస్సు, శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు..! తెలిస్తే షాక్ అవుతారు..!
ప్రేమను వ్యక్తీకరించడానికి కౌగిలింత ఒక సున్నితమైన భావన మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అని మీకు తెలుసా..? శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. కేవలం 20 సెకన్ల పాటు కౌగిలించుకోవడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందట. శరీరానికి ప్రశాంతతను అందిస్తుందని పరిశోధనలో తేలింది.

మనం ప్రేమించే వారిని కౌగిలించుకోవడం వల్ల శరీరం, మనసుకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం 20 సెకన్ల పాటు కౌగిలించుకుంటేనే మానసిక ఒత్తిడి తగ్గిపోతుందని పరిశోధనల్లో వెల్లడైంది. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి, ఆందోళన తగ్గింపు
ఈ రోజుల్లో పని ఒత్తిడి, భయాందోళనలు, మనసుకు శాంతి లేకపోవడం సహజమైపోయింది. కానీ కేవలం 20 సెకన్ల పాటు కౌగిలించుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలై, మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.
మానసిక ఆరోగ్యం
భాగస్వామిని లేదా మనకు ఇష్టమైన వ్యక్తిని కౌగిలించుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది నమ్మకాన్ని పెంచడమే కాకుండా గుండెకు కూడా ఎంతో మేలు చేస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం కౌగిలింత వల్ల మనస్సు ప్రశాంతంగా మారి ఆనందాన్ని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి.
శారీరక నొప్పి నుండి రిలీఫ్
కౌగిలించుకోవడం కేవలం భావోద్వేగాలకే కాదు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో నొప్పిని తగ్గించే హార్మోన్లు కౌగిలింత ద్వారా ఉత్పత్తి అవుతాయి. కొన్ని చికిత్సల కన్నా ఇది ఎంతో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
గుండె ఆరోగ్యం
నార్త్ కరోలినా యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం.. కౌగిలించుకునే వ్యక్తుల గుండె స్పందన సరిగా ఉంటుందని తేలింది. కౌగిలించుకోవడం వల్ల రక్త పోటు నియంత్రితంగా ఉంటుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.
ఒత్తిడి ఎక్కువగా ఉంటే ప్రమాదం
అధ్యయనంలో పాల్గొన్న కౌగిలించుకోని జంటల గుండె స్పందన నిమిషానికి 10 బీట్స్ పెరిగిందని తేలింది. అంటే కౌగిలించుకోని వారి ఒత్తిడి స్థాయి ఎక్కువగా ఉంటుందని స్పష్టమైంది. అందువల్ల మనం ప్రేమించే వారిని కౌగిలించుకోవడం ద్వారా శరీరం, మనస్సుకు చాలా మేలు జరుగుతుంది. ప్రతిరోజూ మనకు ఇష్టమైన వారిని కౌగిలించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. చిన్న కౌగిలింత వల్ల జరిగే మేలు తెలియక చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు.




