ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. కిడ్నీలు మస్తు మంచిగా పనిచేస్తయి..!
ప్రతి రోజు పొద్దున్నే నిద్ర లేవగానే మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి కొన్ని సహజమైన పదార్థాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో ఒకటి కొత్తిమీర. మన వంటగదిలో ఎప్పుడూ ఉండే ఈ కొత్తిమీర ఆకులను నీటిలో మరిగించి తాగితే చాలా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

కొత్తిమీర ఆకులలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫైబర్ వంటి చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ప్రతి రోజు ఉదయం కొత్తిమీర నీటిని తాగడం వల్ల మన శరీరంలోని క్లోమ గ్రంధులు సరిగ్గా పనిచేయడం మొదలవుతుంది.
కొత్తిమీరను తక్కువ మంటపై నీటిలో మరిగించి.. ఆ నీటిని గోరువెచ్చగా ఉదయం ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని చెడు పదార్థాలను బయటకు పంపడంలో ఇది బాగా సహాయపడుతుంది. దీని వల్ల కిడ్నీలు బాగా పనిచేస్తాయి. విష పదార్థాలు తొందరగా బయటకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయి.
కొత్తిమీరకు సహజంగా మూత్రాన్ని ఎక్కువ చేసే గుణం ఉంటుంది. శరీరంలో నీరు నిలిచిపోవడం లేదా వాపులు ఉన్నవారికి కొత్తిమీర నీరు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కిడ్నీలపై పడే ఒత్తిడిని తగ్గించే శక్తి ఈ ఆకులలో ఉంటుంది.
కొంతమందికి కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్యలను ముందుగానే రాకుండా చూసుకోవాలంటే కొత్తిమీర నీటిని తరచూ తాగడం మంచిదని నిపుణులు అంటున్నారు. దీనిలోని సహజ గుణాలు మూత్రనాళాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.
ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. మూత్రం ద్వారా అనవసరమైన మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా శరీరం శుభ్రంగా ఉండి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
పొద్దున్నే నిద్ర లేవగానే కొత్తిమీరతో చేసిన ఈ గోరువెచ్చని నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పూర్తిగా సహజమైన పద్ధతిలో పనిచేస్తుంది. అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తాగడం మొదలుపెట్టే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ఉత్తమం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




