Cancer Symptoms: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు..!
ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యపరంగా కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ కొన్ని లక్షణాలు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే చెప్పగలవు. క్యాన్సర్ నిపుణుల మాటల ప్రకారం వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్ని లక్షణాలను గమనించి ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.

కొందరికి నోటి లోపల గాయాలు ఏర్పడతాయి. ఇవి సాధారణంగా కనిపించవచ్చు కానీ ఎక్కువ రోజులు నయం కాకపోతే ఇది నోటి క్యాన్సర్ కు సంకేతంగా భావించాలి. గాయాలు నెమ్మదిగా పెద్దవిగా మారడం, నొప్పి లేకుండా ఉండటం వంటి లక్షణాలను తేలికగా తీసుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించడం అవసరం.
శరీరంలో రక్తస్రావం అనేక కారణాల వల్ల వస్తుంది. కానీ తరచూ స్పష్టమైన కారణం లేకుండా రక్తం రావడం అనేది ప్రమాద సంకేతం. దంతాల మధ్య నుంచి రక్తం రావడం, ముక్కు నుంచి తరచూ రక్తం కారడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి శరీరంలో ఏదో తేడా జరుగుతుందన్న సూచనగా పరిగణించాలి.
తరచూ దగ్గు వచ్చే వారిలో కొన్ని సందర్భాల్లో దగ్గుతో పాటు రక్తం కూడా రావచ్చు. ఇది ఊపిరితిత్తుల సమస్య కాదు కాబట్టి దీన్ని తేలికగా తీసుకోవద్దు. అలాగే మలంలో రక్తస్రావం పెద్దపేగు క్యాన్సర్ కు సంకేతంగా భావించవచ్చు. వీటిని గమనించి వెంటనే పరీక్షలు చేయించుకోవడం అవసరం.
శరీరంలో ఏదైనా భాగంలో వాపు ఎక్కువ కాలం పాటు ఉంటే అది సాధారణం కాదు. అలాంటి వాపులు నెమ్మదిగా గడ్డలాగా మారితే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది క్యాన్సర్ తొలి దశలో కనిపించే లక్షణంగా పరిగణించవచ్చు. అలాంటి సందర్భాల్లో వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
కొంతమందికి మెడ భాగంలో వాపు కనిపిస్తుంది. ఇది నొప్పితో ఉండకపోయినా కూడా దీని వెనుక ఉన్న కారణం తెలుసుకోవాలి. ఇది మెడ క్యాన్సర్ లేదా నోటి క్యాన్సర్ సంకేతంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి లక్షణాలను ఊహలతో ఊదరగొట్టకుండా వైద్య సలహా అవసరం.
ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్లకు రొమ్ము క్యాన్సర్ వస్తుంది. ఇది తొందరగా పెరుగుతున్న సమస్య. రొమ్ములో వాపు వస్తే దాన్ని జాగ్రత్తగా చూడాలి. ఆ వాపు పెద్దగా అవుతుందా.. నొప్పి లేకపోయినా పెరుగుతుందా అని గమనించాలి. ఇలా ఉంటే అది రొమ్ము క్యాన్సర్ కు మొదటి గుర్తు కావొచ్చు.
మన శరీరంలో కనిపించే మార్పులు మన ఆరోగ్యాన్ని ముందుగానే హెచ్చరిస్తుంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా సమస్య పెరుగుతుంది. పై చెప్పిన లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




