Lemon Water Benefits: కరోనా సమయంలో నిమ్మకాయ నీటిని అలవాటు చేసుకున్నారా.. దీంతో మరెన్నో లాభాలున్నాయని తెలుసా.
Lemon Water Benefits: కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆహార నియమాలను మార్చేశారు. నోటికి మాస్కు ధరించడం ఎంత కచ్చితంగా మారిందో పౌష్టిక ఆహారం తీసుకోవడం కూడా...
Lemon Water Benefits: కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆహార నియమాలను మార్చేశారు. నోటికి మాస్కు ధరించడం ఎంత కచ్చితంగా మారిందో పౌష్టిక ఆహారం తీసుకోవడం కూడా అంతే కచ్చితంగా మారింది. ఈ క్రమంలోనే కరోనా సమయంలో ఉదయాన్నే నిమ్మకాయ నీటిని తాగే వారి సంఖ్య బాగా పెరిగింది. విటమిన్ సీ అధికంగా లభించే నిమ్మ రసాన్ని తీసుకోవాలని వైద్యులు సైతం సూచించారు. మరి నిమ్మరసం ద్వారా కేవలం కరోనాకు చెక్ పెట్టడమే కాకుండా మరెన్నో లాభాలు ఉన్నాయని మీకు తెలుసా? ప్రతిరోజూ నిమ్మకాయ, నీటి మిశ్రమన్ని తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
* నిమ్మకాయ నీటిని తీసుకోవడం ద్వారా శరీరంలో ద్రవాలు సమతుల్యంగా ఉంటాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. రోజంతా బయట తిరిగే వారు, ఎండలో ఎక్కువ సేపు గడిపే వారు కచ్చితంగా నిమ్మకాయ నీటిని తీసుకోవాలి. * నిమ్మకాయలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుందనే విషయం తెలిసిందే. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడే ముడతలను నిమ్మకాయ నీరుతో తరిమి కొట్టవచ్చు. * నిమ్మకాయ నీరు తాగడం వల్ల నోటి దుర్వాసనకు కూడా చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే పడిగడుపున తీసుకుంటే నోరు శుభ్రంగా మారుతుంది. * కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి కూడా నిమ్మకాయ నీరు దివ్వౌషధంగా పనిచేస్తుంది. రాళ్లు కరిగిపోవడంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తుంది. ఇక లివర్ ఆరోగ్యాన్ని కూడా నిమ్మకాయ నీరు సంరక్షిస్తుంది. * గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. అధిక బరువు, శరీరంలో కొవ్వు పేరుకు పోయిన వారు ప్రతీ రోజు క్రమం తప్పకుండ నిమ్మ నీరు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. * నిమ్మకాయ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరంలో మలినాలు పూర్తిగా తొలగిపోయి శుభ్రంగా మారుతుంది. * మలబద్దకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా నిమ్మ నీరు ఔషధంలా పనిచేస్తుంది. నిత్యం నీమ్మ నీరు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Also Read: Strawberry-Beauty Tips: మీ పళ్ళు పచ్చగా ఉన్నాయా స్టాబెరీతో ఇలా చేసి చూడండి.. మెరిసే దంతాలు మీ సొంతం
Exercise: వ్యాయామం అంటే చాలామందికి ఎన్నో అనుమానాలు.. ప్రశ్నలు.. వాటికి సమాధానాలు ఇవిగో!
Neck Pain: మెడ నొప్పి తీవ్రంగా బాధిస్తుంటే ఇంట్లో ఉండే పదార్థాలతో ఇలా చేయండి.. క్షణాల్లో ఉపశమనం..