World Coconut Day 2023: బాబోయ్.. పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
కొబ్బరి నీళ్లు కూడా ఆరోగ్యానికి ఎంత మంచివో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు మాత్రమే కాకుండా పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరిలో ఫైబర్, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం, విటమిన్లు సి, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి అనేక ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రోజు (సెప్టెంబర్ 02) ప్రపంచ కొబ్బరి దినోత్సవం.
కొబ్బరిని కల్పవృక్షం అంటారు. ఎందుకంటే ఈ చెట్టులోని ప్రతి భాగం ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది. ఎండు కొబ్బరిని, కొబ్బరి నూనెను ప్రతిరోజూ వివిధ వంటకాలను సిద్ధం చేయడానికి.. చర్మం, జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తారు. కొబ్బరి నీళ్లు కూడా ఆరోగ్యానికి ఎంత మంచివో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు మాత్రమే కాకుండా పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరిలో ఫైబర్, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం, విటమిన్లు సి, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి అనేక ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఈ రోజు (సెప్టెంబర్ 02) ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా పోషకాలు పుష్కలంగా ఉండే పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది:
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే అనేక ఔషధ గుణాలు కొబ్బరిలో ఉన్నాయి. ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడతాయి. అందువల్ల, పచ్చి కొబ్బరి గుజ్జును రోజూ తినడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
మలబద్ధకం నుంచి ఉపశమనం:
తక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మలబద్ధకానికి దారితీస్తుంది. పచ్చి కొబ్బరి మీకు ఈ సమస్య నుండి ఉపశమనం ఇస్తుంది. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. పచ్చి కొబ్బరి గుజ్జును రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి రిలీఫ్ ఉంటుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:
పచ్చి కొబ్బరి గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం ఎందుకంటే కొబ్బరిలోని కొవ్వు ఆరోగ్యకరమైన కొవ్వు, ఇది శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుంది:
పడుకునే కొద్దిసేపటి ముందు పచ్చి కొబ్బరిని తినడం వల్ల బాగా నిద్ర పడుతుంది. పచ్చి కొబ్బరిలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాలకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.
చర్మానికి కూడా మేలు చేస్తుంది:
కొబ్బరిలో ఉండే ఫ్యాటీ కంటెంట్ చర్మానికి పోషణనిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అలాగే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని మొటిమల వంటి సమస్యల నుంచి కాపాడతాయి.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
పచ్చి కొబ్బరిలో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా, పచ్చి కొబ్బరి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
జీర్ణ చికిత్స:
పచ్చి కొబ్బరి జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు ఆహారం వేగంగా జీర్ణం కావడానికి సహకరిస్తాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.