భారతదేశంలో ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రజలు తమ జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల కారణంగా గుండె జబ్బులు రావడం సర్వ సాధారణమైపోయింది. అందువల్ల ప్రస్తుత కాలంలో గుండెపోటు ప్రారంభ సంకేతాలు, లక్షణాలను తెలుసుకోవాలి. రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించలేకపోవడం వల్ల గుండె నొప్పి వస్తుంది. ముఖ్యంగా గుండె కండరాల నష్టం కాలక్రమేణా పెరుగే కొద్దీ గుండె పోటు ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా గుండె పోటు వచ్చిన సమయంలో తీసుకున్న జాగ్రత్తలే రోగి ప్రాణాలను కాపాడడంతో కీలక పాత్ర పోషిస్తాయి. గుండె పోటు వచ్చే ముందు సంకేతాలు ఏ విధంగా ఉంటాయి? ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెపోటుకు ముఖ్యమైన సంకేతాలలో ఛాతీ నొప్పి ఒకటి. ఒక వ్యక్తి ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున నొప్పి లేదా అసౌకర్యం, పిండడం వంటివి అనుభూతి చెందితే కచ్చితంగా గుండె పోటు అని అనుమానించాలి. ఇది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అయితే ఈ నొప్పి మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుండె కండరాలకు రక్తం చేరకుండా అడ్డుకోవడం ఈ నొప్పికి కారణంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పి తగ్గదు. కాబట్టి వెంటనే వైద్య సాయం పొందాలి.
ముఖ్యంగా ఎగువ శరీరంలో నొప్పితో పాటు రెండు చేతులలో లాగినట్లు అనిపించినా అనుమానించాలి. ఈ నొప్పి భుజాల వరకు ప్రసరిస్తుంది. మెడ, వెన్ను, దంతాలు లేదా దవడ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పితో పాటు వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లడం ఉత్తమం.
వ్యక్తికి మైకము, బలహీనత, చలి చెమటలు పట్టడం లేదా మూర్ఛపోయినట్లు అనిపించినా గుండె నొప్పి కింద అనుమానించాలి. ఆయా లక్షణాలు కూడా వ్యాధి తీవ్రతను బట్టి వ్యక్తి ఆరోగ్యాన్ని బట్టి మారుతాయి. వికారం, వాంతులు, అసాధారణ అలసట, నిద్ర భంగం, ప్రేగుల్లో అసౌకర్యం వంటి అసాధారణ లక్షణాలున్నా అనుమానించాలి. ఎందుకంటే గుండెపోటు లక్షణాలు, గ్యాస్ట్రిక్ లక్షణాలను ఒకేలా ఉంటాయని గుర్తుంచుకోవాలి.
నోట్.. ఈ కథనంలో పేర్కొ న్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం