AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవడం లేదా? ఈ 5 ఇంటి నివారణలు సమస్యను దూరం చేస్తాయి..

ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యానికి గురికావాలన్నా అన్నింటికి మూల కారణం జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థ సరిగా ఉంటే.. ఆరోగ్యంగా ఉండొచ్చు.

Health Tips: ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవడం లేదా? ఈ 5 ఇంటి నివారణలు సమస్యను దూరం చేస్తాయి..
Partial Constipation
Shiva Prajapati
|

Updated on: Nov 05, 2022 | 6:41 AM

Share

ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యానికి గురికావాలన్నా అన్నింటికి మూల కారణం జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థ సరిగా ఉంటే.. ఆరోగ్యంగా ఉండొచ్చు. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే.. అనేక రోగాలు చుట్టుముడుతాయి. పొట్ట శుభ్రంగా లేకపోతే.. నిరంతరం వ్యాధులు వేధిస్తుంటాయి. అయితే, చాలా మంది ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవక అవస్థలు పడుతుంటారు. దీనికి కారణం గ్యాస్ట్రో పెరోసిస్ అని చెబుతున్నారు నిపుణులు. దీని కారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. ఉదర కండరాలు సరిగా పని చేయవు. ఫలితంగా కడుపు పూర్తిగా శుభ్రమవదు. ఈ రకమైన సమస్య ఉన్నవారు.. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం, గుండెల్లో మంట, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి అనేక హోమ్ రెమిడీస్ ఉన్నాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

పుష్కలంగా నీరు త్రాగాలి..

నీరు శరీరం నుండి, కడుపులోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. దీని వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. జీర్ణక్రియ బాగా ఉంటుంది. ఉదయాన్నే క్రమం తప్పకుండా గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. రోజంతా 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలి. తద్వారా పొట్ట శుభ్రంగా ఉంటుంది.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి..

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణక్రియకు ఉత్తమ ఎంపికగా పరిగణించబడుతుంది. యాపిల్స్, బేరి, స్ట్రాబెర్రీ, క్యారెట్, బీన్స్, కాయధాన్యాలు, చిక్‌పీస్, ఓట్స్ వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వాటిని ఆహారంలో చేర్చవచ్చు.

తేనె, నిమ్మరసం..

నిమ్మరసంలో కాసింత తేనె కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వంటి ఉదర సంబంధిత సమస్యలన్నీ నయమవుతాయి. దీంతో పొట్ట కూడా శుభ్రంగా ఉంటుంది.

జ్యూస్‌లు, స్మూతీలు..

శరీరానికి అవసరమైన అన్ని మూలకాలు ఆపిల్, నిమ్మ, కలబంద వంటి అనేక పండ్లు, కూరగాయలలో కనిపిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా జ్యూస్‌లు, స్మూతీస్ రూపంలో తాగడం వల్ల పొట్టను శుభ్రం చేయడంలో సహాయపడుతాయి.

సేంద్రీయ, మూలికా టీలు..

ఫైటోకెమికల్స్ కలిగిన అనేక మూలికలు ఉన్నాయి. ఇవి శరీరంలో చెడు బ్యాక్టీరియా పెరగనివ్వవు. మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలను అవి దూరం చేస్తాయి. ఉదయాన్నే కడుపుని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని కారణాల వల్ల కడుపు క్లియర్ అవ్వకపోతే ఈ ఐదు ఇంటి నివారణలు ఈ సమస్యను వదిలించుకోవడానికి సహాయపడతాయి.

హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?