AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking Water: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం సరైనదేనా?

మన శరీరానికి తాగునీరు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే తిన్న వెంటనే నీళ్లు తాగడం సరైనదా..?కదా? అది సరియైనదా తప్పా అనేది మీరు తిన్నదానిపై ఆధారపడి ఉంటుంది. పండ్లు, కూరగాయలు తిన్న తర్వాత నీరు తాగటం ప్రయోజనకరంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడానికి, టాక్సిన్స్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

Drinking Water: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం సరైనదేనా?
Health Tips
Subhash Goud
|

Updated on: Aug 01, 2023 | 9:56 PM

Share

మన శరీరానికి తాగునీరు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే తిన్న వెంటనే నీళ్లు తాగడం సరైనదా..?కదా? అది సరియైనదా తప్పా అనేది మీరు తిన్నదానిపై ఆధారపడి ఉంటుంది. పండ్లు, కూరగాయలు తిన్న తర్వాత నీరు తాగటం ప్రయోజనకరంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడానికి, టాక్సిన్స్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. పుష్కలంగా నీరు తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ ద్వారా మీ శరీరం అంతటా ఫైబర్‌ను తరలించడంలో సహాయపడుతుంది. మనం తినే ఆహారం ద్వారా మన శరీరానికి పోషకాలు అందడం ఖాయం. అయితే జామ, అరటి, యాపిల్ వంటి కొన్ని పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పిండి పదార్ధాలు తిన్న వెంటనే నీరు తాగవద్దు

బ్రెడ్, పాస్తా, బంగాళదుంపలు వంటి పిండి పదార్ధాలు తిన్న వెంటనే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. భోజనంతో పాటు నీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా అజీర్ణం ఏర్పడుతుంది. ఏది ఆరోగ్యానికి మంచిది కాదు.

హెవీ, స్పైసీ ఫుడ్ తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం మానుకోండి

తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణక్రియపై హానికరమైన ప్రభావం ఉంటుంది. చల్లటి నీరు జీర్ణవ్యవస్థను షాక్ చేస్తుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. మీ శరీరం ఆహారం నుంచి పోషకాలను గ్రహించడం కష్టతరం చేస్తుంది. అందుకే మీరు చల్లటి నీరు తాగాలనుకుంటే భోజనం చేసిన అరగంట తర్వాత తాగండి.

ఇవి కూడా చదవండి

హెవీ ఫుడ్ తిన్న తర్వాత హెర్బల్ టీ తాగాలి

మీరు మంచి జీర్ణక్రియ, హైడ్రేటెడ్ గా ఉండటానికి పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే, మీరు భోజనం తర్వాత హెర్బల్ టీని తీసుకోవాలి. అల్లం, పుదీనా, చమోమిలే వంటిfr మూలికలతో చేసిన టీలు జీర్ణక్రియకు సహాయపడతాయి. మంటను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు ఎంత హెవీగా, స్పైసీగా తిన్నా, వేడి వేడి హెర్బల్ టీ తాగడం వల్ల మీ శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంటాయి. అలాగే, ఇది జీర్ణక్రియ ప్రక్రియను చక్కగా ఉంచుతుంది .శరీరానికి విశ్రాంతి కూడా లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి