Health Tips: వైట్ రైస్‌తో కూడా ఈజీగా బరువు తగ్గుతారు..! అదెలాగో తెలుసా..?

|

Aug 28, 2022 | 3:22 PM

వైట్‌ రైస్‌ని తగినంత పప్పులు, కూరగాయలతో కలిపినప్పుడే మంచి ఆహారంగా పరిగణించబడుతుంది. త్వరగా బరువు తగ్గడానికి మీరు ప్రోటీన్, ఫైబర్ కంటెంట్‌తో కూడిన

Health Tips: వైట్ రైస్‌తో కూడా ఈజీగా బరువు తగ్గుతారు..! అదెలాగో తెలుసా..?
White Rice
Follow us on

Health Tips: జిమ్ లేదా వ్యాయామం ప్రారంభించే ముందు మంచి డైట్ చార్ట్ సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం . దాని సహాయంతో, మీరు త్వరగా బరువు తగ్గించుకునే లక్ష్యాన్ని సాధించవచ్చు. అదే సమయంలో త్వరగా బరువు తగ్గడానికి సాధారణంగా సమతుల్య ఆహారం, లేదంటే స్పెషల్ డైట్‌ఫుడ్‌ని ఆశ్రయిస్తారు చాలా మంది. ఎంత బరువు తగ్గాలి అని మీరు ఆలోచించినప్పుడు మీరు ఉత్తమమైన ఆహారాన్ని ఎంచుకోవచ్చు. అయితే, చాలా మంది డైట్‌ ఫుడ్‌ చార్ట్‌ను సిద్ధం చేసుకునేటప్పుడు..అందులో వారు వైట్ రైస్‌ను దాటవేస్తారు.. కానీ అలా చేయడం తప్పంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వైట్‌రైస్‌ తింటూ కూడా బరువు తగ్గించుకునే మార్గాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…
అత్యంత ప్రసిద్ధ,సరళమైన భారతీయ ఆహారం పప్పు, అన్నం. ఈ రెండింటినీ మితంగా తీసుకోవడం బరువు తగ్గడానికి మంచి ఎంపిక. కొన్ని ఆకుకూరలు, మొలకలు మీరు ఆహారంలో తీసుకోవచ్చు. ఉదాహరణకు.. చిక్పీస్, ఇతర చిక్కుళ్ళలో ప్రోటీన్, ఫైబర్,కార్బోహైడ్రేట్లలో పుష్కలంగా ఉంటాయి. దీని వినియోగం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. త్వరగా బరువు తగ్గడమే మీ లక్ష్యం అయితే, రోజూ తెల్లటి అన్నం మాత్రమే తినండి. రాత్రి భోజనంలో మాత్రమే దీన్ని ఎంచుకోండి. అన్నంతో పాటుగా గుడ్లను కూడా తినండి.

వైట్‌ రైస్‌ని తగినంత పప్పులు, కూరగాయలతో కలిపినప్పుడే మంచి ఆహారంగా పరిగణించబడుతుంది. త్వరగా బరువు తగ్గడానికి మీరు ప్రోటీన్, ఫైబర్ కంటెంట్‌తో కూడిన కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వాటిని ఉడికించి తినటం మంచిది. బరువు తగ్గడం నుండి బరువు పెరగడం వరకు.. సరైన వంట, తినే విధానం తెలుసుకోవాలి. వైట్ రైస్‌తో బరువును పెంచుకోవచ్చు..తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి