Health Tips: వాకింగ్ తర్వాత నీరు వెంటనే తాగడం మంచిదేనా.. నిపుణులు ఏం సూచిస్తున్నారంటే..?
Health Tips: మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. వ్యాయామం చేసిన తర్వాత లేదా నడక సమయంలో నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం.

Health Tips: మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. వ్యాయామం చేసిన తర్వాత లేదా నడక సమయంలో నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు వ్యాయామం చేసే సమయంలో నీటిని తీసుకుంటే అది మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అదే సమయంలో అలసట, బలహీనత వంటి సమస్యలను తొలగిస్తుంది. నడిచాక నీళ్లు తాగాలా వద్దా అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతోంది. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి నడక లేదా వ్యాయామం పూర్తి చేసిన తర్వాత 2 గంటల విరామంలో కచ్చితంగా నీరు తాగాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. సీజన్‌ను బట్టి నీటి పరిమాణం ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. వేడిగా ఉంటే చెమట ఎక్కువగా పడుతుంది. అప్పుడు డీహైడ్రేషన్ సమస్య కూడా ఏర్పడుతుంది.
ఈ సందర్భంలో మీరు ఎక్కువ నీరు తీసుకోవాలి. కానీ మీరు నడకకు ముందు ఎక్కువ నీరు తాగకుండా ఉండాలి. ఎందుకంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. చాలా తక్కువ నీరు తీసుకున్నా శరీరంలో శక్తి ఉండదు. కాబట్టి కొంచెం కొంచెం నీటిని తీసుకుంటు ఉండాలి. నడక తర్వాత ఎంత నీరు తాగాలి అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. నడక తర్వాత ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్ల నీరు తాగాలి. తద్వారా నీటి కొరతను అధిగమించవచ్చు. ఎందుకంటే చెమట కారణంగా శరీరంలో నీటి కొరత ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే తాగునీరు చాలా ముఖ్యం.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.