Pregnant Women: స్త్రీలు గర్భధారణ సమయంలో బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందా? వైద్యులు ఏమంటున్నారు?
గర్భిణీ స్త్రీలు తన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసూతి అయ్యే వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు పదేపదే చెబుతున్న..
గర్భిణీ స్త్రీలు తన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసూతి అయ్యే వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు పదేపదే చెబుతున్న విషయంలో తెలిసిందే. ఇక ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ సమయంలో వారి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. హార్మోన్లలో మార్పుల కారణంగా వారికి వాంతులు, వికారం, శరీరంలో నొప్పులు ఉండవచ్చు. ఈ సమయంలో స్త్రీ తన ఆరోగ్యం, తన పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మహిళలు ఆహారంలో చాలా వాటికి దూరంగా ఉంటారు. ఇక గర్బిణీ స్త్రీలకు బొప్పాయి గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో బొప్పాయి తినాలా వద్దా అనేది అతిపెద్ద ప్రశ్న. దాని ప్రయోజనాలు ఏమిటి? బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుందా..? అనే అనుమానాలు తలెత్తుతుంటాయి. దీనిపై ఆరోగ్య నిపుణులు కీలక విషయాలను వెల్లడిస్తు్న్నారు.
గర్భధారణ సమయంలో బొప్పాయి తినాలా వద్దా?
గర్భిణీ స్త్రీలకు పోషకాలు చాలా అవసరం. బొప్పాయిలో ప్రొటీన్, డైటరీ ఫైబర్ ఉంటాయి. బొప్పాయితో పీరియడ్స్‌లో మార్పు ఉండదు. గర్భిణీ స్త్రీలకు ఆహారం, పోషకాలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో మహిళలు సమతుల ఆహారం తీసుకుంటారు. బొప్పాయి అన్ని పండ్లలో అత్యంత రుచికరమైనది. దీనితో పాటు, ఇది మన ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. కానీ గర్భధారణ సమయంలో కొన్ని పండ్లు తినకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అయినప్పటికీ పండిన బొప్పాయిలో బీటా కెరోటిన్, కోలిన్ ఫైబర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు ఎ, బి,సి పుష్కలంగా ఉన్నాయి. పండిన బొప్పాయి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ గర్భధారణ సమయంలో పచ్చి బొప్పాయిని తినకూడదు. పచ్చి బొప్పాయిలో లేటెక్స్ ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది.
గర్భధారణ సమయంలో ఈ పండ్లను తినకండి
గర్భధారణ సమయంలో మీరు ద్రాక్ష తినకూడదు. ద్రాక్షలో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ద్రాక్ష తొక్కను జీర్ణం చేయడం కష్టం. అలాగే గర్భిణీ స్త్రీలు పైనాపిల్ తినకూడదు. పైనాపిల్ గర్భస్రావం కలిగిస్తుంది. అందువల్ల గర్భధారణ సమయంలో మీకు ఏదైనా పండు తినాలని అనిపించినప్పుడు తినడానికి ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. వైద్యుని సలహాలు లేనిది ఏ పండ్లు కూడా తినకూడదు. సొంత ఆలోచనలు, సూచనలు పనికి రావని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి