Smoking Kills: మీరు రోజుకు 10 సిగరెట్లు తాగుతున్నారా..? ఏమవుతుంది.. నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ షాకింగ్‌ విషయాలు

ధూమపానం అలవాటు ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ అలవాటు ఉన్నవారికి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం..

Smoking Kills: మీరు రోజుకు 10 సిగరెట్లు తాగుతున్నారా..? ఏమవుతుంది.. నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ షాకింగ్‌ విషయాలు
Cigarette Health Problem
Follow us
Subhash Goud

|

Updated on: Nov 06, 2022 | 11:27 AM

ధూమపానం అలవాటు ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే విషయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ అలవాటు ఉన్నవారికి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ. చాలా మంది సిగరేట్లకు బానిసవుతున్నారు. మీరు రోజుకు 10 సిగరెట్లు తాగుతున్నారా ? అయితే ఈ అలవాటు మిమ్మల్ని వేగంగా మరణానికి నెట్టివేస్తోందని తెలుసుకోండి. సిగరెట్ వ్యసనాన్ని విడిచిపెట్టడం అంత సులభం కాదు.. కానీ అధిక వినియోగం మిమ్మల్ని అకాల అనారోగ్యానికి గురి చేస్తుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌సీఐ) ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 10 కంటే ఎక్కువ సిగరెట్లను తాగినట్లయితే మరణానికి చేరువలో ఉన్నట్లేనని ఎన్‌సీఐ పేర్కొంది. రోజుకు ఎక్కువ మొత్తంలో సిగరెట్లు తాగినట్లయితే ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిపింది.

ఒక వ్యక్తి రోజుకు 10 సిగరెట్లు తాగితే అవయవ వైఫల్యం వంటి అధ్వాన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. రోజుకు ఒక సిగరెట్ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని బ్రిటిష్ మెడికల్ జనరల్ (బీఎంజే) పరిశోధకులు తెలిపారు.

సిగరెట్ వల్ల ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం:

  • ఊపిరితిత్తుల క్యాన్సర్
  • గుండె జబ్బులు
  • స్ట్రోక్
  • ఊపిరితితుల జబు
  • వివిధ కంటి వ్యాధులు
  • రోగనిరోధక వ్యవస్థ వారం

ఈ విధంగా మీరు సిగరెట్ వ్యసనాన్ని వదిలించుకోవచ్చు:

సిగరెట్ అలవాటు ఉంటే దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో ఆలోచించాలి. మీకు సిగరెట్ తాగాలని అనిపించినప్పుడల్లా ఆ సమయంలో మీకు ఇష్టమైన ఆహారాన్ని తినండి. సిగరెట్ తాగడం మానేయాలనే సంకల్పం చాలా ముఖ్యం. దీనితో పాటు మీకు సిగరెట్ తాగాలని అనిపించినప్పుడల్లా దీర్ఘంగా శ్వాస తీసుకొని నీరు తాగాలి. ఈ విధంగా మీ దృష్టిని మరల్చవచ్చంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

అంతే కాకుండా ఉసిరి, అల్లం పొడి తీసుకుని అందులో నిమ్మరసం, ఉప్పు కలిపి పేస్ట్ చేయాలి. మీకు సిగరెట్ తాగాలని అనిపించినప్పుడల్లా ఈ పేస్ట్‌ని కొంచెం తినడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల సిగరెట్‌కు దూరంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి