AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coffee: కాఫీ తాగితే బరువు పెరుగుతారా.. ఇందులో నిజమెంత.. నిపుణులు ఏమంటున్నారంటే..

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన పానీయాల్లో కాఫీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా సేవించే కాఫీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలపు ఉదయపు వేళ వేడి..

Coffee: కాఫీ తాగితే బరువు పెరుగుతారా.. ఇందులో నిజమెంత.. నిపుణులు ఏమంటున్నారంటే..
Coffee
Ganesh Mudavath
|

Updated on: Nov 06, 2022 | 1:46 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన పానీయాల్లో కాఫీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా సేవించే కాఫీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలపు ఉదయపు వేళ వేడి వేడిగా పొగలు కక్కే కాఫీని సిప్ చేస్తుంటే ఆ అనుభూతే వేరు. అయితే చాలా మందిలో కాఫీ తాగడంపై సందేహాలు ఉన్నాయి. ఇందులో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని భావిస్తుంటారు. ఇది కాస్త వాస్తవమే అయినప్పటికీ.. కాఫీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కాఫీ తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఆకలిని అదుపులో ఉంచుంతుంది. బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ కారణంగా నిద్రలేమి సమస్యలు కలగవచ్చు. ఇది శరీరం బరువు పేరిగేలా చేస్తాయి. కెఫిన్ ఉద్దీపనగా పనిచేయడమే కాకుండా అడెనోసిన్ హార్మోన్‌ను అడ్డుకుంటుంది. దీని వల్ల నిద్ర సరిగ్గా పట్టక చికాకు కలుగుతుంది. అయితే కాఫీ తాగే సమయంలో చాలా మంది అడిషనల్ షుగర్ యాడ్ చేసుకుంటారు. ఇది శరీరంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది.

సాధారణంగా కాఫీ తాగేటప్పుడు బిస్కెట్లు, పేస్ట్రీలు తింటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోకి అదనపు చక్కెర యాడ్ అవుతుంది. కేక్స్, పేస్ట్రీల స్థానంలో నట్స్, గుడ్లు వంటి ప్రొటీన్ డైట్ తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. సాయంత్రం సమయంలో కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. అటువంటి పరిస్థితిలో కనీసం 100 ml కాఫీని తీసుకోవచ్చు. లేదంటే నిద్రపై చెడు ప్రభావం చూపుతుంది. బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది. పాలతో చేసిన కాఫీలో చాలా కేలరీలు ఉంటాయి. ఇది బరువు పెరగడానికి కారణం కావచ్చు. బరువు తగ్గడానికి కాఫీలో చక్కెర కలపవద్దు. కాఫీలో పాలను ఉపయోగించాలనుకుంటే వాటి స్థానంలో బాదం లేదా కొబ్బరి పాలను ఉపయోగించాలి. దాల్చిన చెక్క పొడిని యాడ్ చేస్తే మంచి ఉపయోగాలు ఉంటాయి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి