Health Tips: డిప్రెషన్‌తో బాధపడుతున్నారా?.. అయితే, ఈ నాలుగంటిని అస్సలు టచ్ చేయొద్దు.. వివరాలు తెలుసుకోండి..

Health Tips: ప్రస్తుత కాలంలో ఒత్తిడి ప్రతీ ఒక్కరికి పెను సవాల్‌గా మారింది. ఒత్తిడి పెరిగి.. అది నిరాశ, నిస్పృహలకు దారి తీస్తోంది. అయితే, డిప్రెషన్‌తో బాధపడేవారు కొన్ని రకాల తినే పదార్థాలు,

Health Tips: డిప్రెషన్‌తో బాధపడుతున్నారా?.. అయితే, ఈ నాలుగంటిని అస్సలు టచ్ చేయొద్దు.. వివరాలు తెలుసుకోండి..
Depression

Updated on: Nov 26, 2021 | 6:58 AM

Health Tips: ప్రస్తుత కాలంలో ఒత్తిడి ప్రతీ ఒక్కరికి పెను సవాల్‌గా మారింది. ఒత్తిడి పెరిగి.. అది నిరాశ, నిస్పృహలకు దారి తీస్తోంది. అయితే, డిప్రెషన్‌తో బాధపడేవారు కొన్ని రకాల తినే పదార్థాలు, ఇతర అలవాట్లు ఉంటే వాటిని మానుకోవడం మంచింది. లేదంటే పరిస్థితి మరింత విషమంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1. ప్రజలు ఒత్తిడి, డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఆల్కహాల్ తీసుకుంటుంటారు. అయితే, అలా చేయడం వల్ల సమస్య తీవ్రత మరింత పెరుగుతుందట. ఆల్కహాల్ వారి సమస్యను మరింత ఎక్కువ చేస్తుందే కానీ, తక్కువ చేయదట. ఆల్కహాల్ నిరాశ, ఆందోళనను ప్రేరేపించడానికి పనిచేస్తుంది. కావున.. డిప్రెషన్‌తో పోరాడుతూ ఆల్కహాల్ తీసుకుంటుంటే, ఈరోజే దాన్ని మానేయడానికి ట్రై చేయండి.

2. ఎక్కువగా కాఫీ తాగినా.. మీ డిప్రెషన్ సమస్యను మరింత పెంచుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. కెఫీన్ మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇది వ్యక్తిపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా డిప్రెషన్ తీవ్రరూపం దాలుస్తుంది. అందుకని, డిప్రెషన్‌తో బాధపడే రోగులు ఎక్కువగా కాఫీ తీసుకోకూడదు.

3. ప్రస్తుత కాలంలో ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ఫుడ్‌ లు తినడం విపరీతంగా పెరిగింది. డిప్రెషన్ రోగులకు ఈ ఫుడ్ ఎంతమాత్రం మంచిది కాదు. సాధారణంగా.. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ప్రజలకు మంచివి కావు. అంతే కాకుండా కూల్‌డ్రింక్స్, సోడాలు, ఎనర్జీ డ్రింక్స్ మొదలైన కృత్రిమ స్వీటెనర్లకు దూరంగా ఉండండి.

4. ధూమపానం అన్ని వ్యాధులకు మూల కారణంగా చెప్పాలి. ధూమపానం ఒత్తిడి స్థాయిలను మరింత పెంచుతుంది. చాలా మంది డిప్రెషన్‌లో ఎక్కువ సిగరెట్లు తాగుతారు. దీని కారణంగా వారి పరిస్థితి మరింత దిగజారుతుంది.

Also read:

Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే..

Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..

Flashback: చీరకట్టులో అనసూయ.. రొమాంటిక్‌గా రెజీనా, ప్రభుదేవా.. ఆకట్టుకుంటోన్న ఫ్లాష్‌బ్యాక్‌ కొత్త పోస్టర్లు..