Ayurvedic Herbs: ప్రస్తుత కాలంలో యావత్ ప్రపంచాన్ని అనేక రకాల వ్యాధులు వేధిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత వర్షాకాలంలో అనేక వ్యాధులు వెంటాడుతాయి. దగ్గులు, జలుబు, జ్వరం, అలర్జీ, ఇన్‌ఫెక్షన్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ రెయినీ సీజన్‌లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అయితే, ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుర్వేదంలో అనేక మూలికలు ఉన్నాయి. వాటిని తీసుకోవడం ద్వారా సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆయుర్వేద మూలికలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గిలోయ్..
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో గిలోయ్ సహాయపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. గిలోయ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించడంలో గిలోయ్ సహాయపడుతుంది.
తులసి..
హిందూమతంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసి చెట్టును పూజిస్తారు. ఆయుర్వేద పరంగా తులసిని ఔషధంగా వినియోగిస్తారు. అనేక వ్యాధుల చికిత్స కోసం గృహాలలో కూడా ఉపయోగిస్తారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే థెరప్యూటిక్ గుణాలు జలుబు, దగ్గు, జ్వరంతో పోరాడటానికి పని చేస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మోరింగ..
మోరింగను రోగనిరోధక శక్తిని పెంచే మూలికగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. ఇది కాకుండా, ఇందులో అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలోని కణాలు, కండరాలను బలంగా మార్చడంలో సహాయపడతాయి.
వెల్లుల్లి..
వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల.. సీజనల్ వ్యాధుల నుంచి క్షేమంగా ఉండొచ్చు.
ములేటి(అతిమధురం)..
వర్షాకాలంలో వచ్చే గొంతునొప్పి, జలుబు సమస్యను ఎదుర్కోవటానికి మీరు లిక్కోరైస్(అతిమధురం)ని కూడా తీసుకోవచ్చు. దీనిని కషాయాల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది అనేక ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
పుదీనా..
పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడానికి పనిచేస్తుంది. జలుబు, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు పుదీనాను కూడా తీసుకుంటారు. ఇది ఇన్ఫెక్షన్ నుండి రక్షించడానికి పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పుదీనా టీని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.