AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే స్వీట్‌ కార్న్‌… వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా..?

Health Benefits With Sweet Corn: మనకు విరివిగా దొరికే ఆహార పదార్థాల్లో మొక్కజొన్న ఒకటి. ముఖ్యంగా సూపర్‌ మార్కెట్‌ కల్చర్‌ వచ్చాక కాలంతో సంబంధం లేకుండా ఇవి లభిస్తున్నాయి. మొక్కజొన్నను ఎన్నో రకాలుగా ఆహారంగా..

Health: ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే స్వీట్‌ కార్న్‌... వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా..?
Narender Vaitla
|

Updated on: Feb 06, 2021 | 5:41 AM

Share

Health Benefits With Sweet Corn: మనకు విరివిగా దొరికే ఆహార పదార్థాల్లో మొక్కజొన్న ఒకటి. ముఖ్యంగా సూపర్‌ మార్కెట్‌ కల్చర్‌ వచ్చాక కాలంతో సంబంధం లేకుండా ఇవి లభిస్తున్నాయి. మొక్కజొన్నను ఎన్నో రకాలుగా ఆహారంగా తీసుకుంటారు. మొక్క జొన్నతో తయారయ్యే అన్నీ పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిలో స్వీట్‌ కార్న్‌ మొదటి వరుసలో ఉంటుంది. అప్పటికప్పుడు సింపుల్‌గా ఉడకపెట్టుకొని తినే స్వీట్‌ కార్న్‌ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మారుతోన్న జీవన విధానం, ఆహార పదార్థాలతో దెబ్బ తింటోన్న ఆరోగ్యాన్ని స్వీట్‌ కార్న్‌తో చక్కదిద్దుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ స్వీట్‌ కార్న్‌తో కలిగే ఆ ప్రయోజనలేంటో ఓసారి చూద్దామా..!

* స్వీట్‌ కార్న్‌లో యాంటీఆక్సిడెంట్‌లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్‌, లివర్‌ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడంలో వీటి పాత్ర క్రీయాశీలకంగా ఉంటుంది.

* స్వీట్‌ కార్న్‌ అంటేనే ఫైబర్‌కు కేరాఫ్‌గా చెప్పవచ్చు. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో మలబద్ధకం, పైల్స్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాంటి వారికి ఈ స్వీట్‌ కార్న్‌ దివ్యవౌషధమని చెప్పాలి.

* ఇక స్వీట్ కార్న్‌లో ఉండే విటమిన్‌ సి, కెరోటినాయిడ్స్‌, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

* వీటిలో ఉండే పాస్ఫరస్‌, మెగ్నీషియం, మ్యాంగనీస్‌, ఐరన్‌, కాపర్‌, జింక్‌ వంటి పోషకాలు.. ఎముకలు, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక స్వీట్‌ కార్న్‌లో ఉండే విటమిన్‌ బి12, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌లు రక్తహీనతకు చెక్‌ పెడతాయి.

* నిత్యం ఒత్తిళ్ల పొత్తిళ్లలో నలిగిపోయే వారికి స్వీట్‌ కార్న్‌ మంచి మందులా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫినోలిక్‌ ఫైటోకెమికల్స్‌ హైపర్‌ టెన్షన్‌ తగ్గిండచంలో బాగా పనిచేస్తుంది.

* స్వీట్‌ కార్న్‌ చాలా త్వరగా జీర్ణం కావడంతో ఉన్నపలంగా శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. ఇలా ఎన్నో మంచి గుణాలున్న స్వీట్‌ కార్న్‌ను ప్రతిరోజూ కచ్చితంగా ఆహారంలో ఓ భాగం చేసుకుంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

Also Read: క్యాన్సర్‏ను అదుపుచేయడానికి ఉల్లిపాయాలు సహయపడతాయా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..