తెలంగాణ డీజీపీకి కోవిడ్‌ టీకా.. టీకాపై అనుమానాలు, ఆపోహాలు అక్కర లేదన్న మహేందర్‌రెడ్డి

తెలంగాణలో కరోనా ఫ్రంట్‌ వారియర్స్‌కు టీకా కార్యక్రమంలో భాగంగా డీజీపీ మహేందర్‌రెడ్డి కోవిడ్‌ టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా..

తెలంగాణ డీజీపీకి కోవిడ్‌ టీకా.. టీకాపై అనుమానాలు, ఆపోహాలు అక్కర లేదన్న మహేందర్‌రెడ్డి
Follow us
K Sammaiah

|

Updated on: Feb 06, 2021 | 4:12 PM

తెలంగాణలో కరోనా ఫ్రంట్‌ వారియర్స్‌కు టీకా కార్యక్రమంలో భాగంగా డీజీపీ మహేందర్‌రెడ్డి కోవిడ్‌ టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా కొవిడ్‌ టీకా చాలా సురక్షితమైందని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. తిలక్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కొవిడ్‌ వాక్సిన్ వేయించుకున్నారు.

కొవిడ్‌ టీకాపై అనుమానాలు, అపోహలు వద్దని డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే కొవిడ్‌ టీకా వేయించుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం పోలీసు సిబ్బంది సైతం వేయించుకుంటున్నారని అన్నారు. ప్రజల్లో భయాలు, అపోహలు తొలగించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

కరోనా వ్యాప్తి సమయంలో వైద్యులు, పోలీసులు ప్రాణాలకు ఎదురొడ్డి సేవలు అందించారని పేర్కొన్నారు. తొలిదశలో కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.

Read more:

మావోయిస్టుల ఏరివేతకు మహిళా కమెండోలు.. మహిళా బెటాలియన్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్న కమెండోలు