వారి సూచనల మేరకే ప్రభుత్వం నిర్ణయం.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి క్లారిటీ
కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై..
కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై స్పందించారు. నీతీ ఆయోగ్ సిఫారసుల మేరకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మాత్రమే విక్రయించాలని నీతీ ఆయోగ్ పేర్కొందని, ఆ ప్రకారమే తాము ముందుకు వెళతామని చెప్పారు. అయితే ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించాలన్న ఆలోచన తమకు లేదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఏపీ, తెలంగాణకు అన్యాయం జరగలేదని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ను జాతీయ దృక్పథంతో చూడాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు గురించి చెబుతూ, ఇటీవల కాలంలో ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన పోలవరం నిధులపై తమను మూడుసార్లు కలిశారని, ఒప్పందం ప్రకారమే పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తున్నామని అనురాగ్ ఠాకూర్ వివరించారు.
Read more: