పక్క రాష్ట్రంలో గుర్తుపట్టని వైసీపీ.. నిజాం షుగర్స్‌ను అమ్మేసిన టీడీపీ.. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణపై ఏపీ బీజేపీ ఎదురుదాడి

బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీపై ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై..

పక్క రాష్ట్రంలో గుర్తుపట్టని వైసీపీ.. నిజాం షుగర్స్‌ను అమ్మేసిన టీడీపీ.. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణపై ఏపీ బీజేపీ ఎదురుదాడి
Follow us
K Sammaiah

|

Updated on: Feb 06, 2021 | 4:50 PM

బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీపై ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు వైసీపీకి లేదని దుయ్యబట్టారు. వైసీపీ వంటి చిన్న పార్టీలను చాలా చూశామని, పక్క రాష్ట్రానికి వెళితే వైసీపీ అంటే ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఓట్ల గురించి మాట్లాడే వైసీపీ, టీడీపీ నేతలు.. ఢిల్లీలో బీజేపీ నేతల అపాయింట్ మెంట్ కోసం క్యూ కడుతున్నారని కామెంట్‌ చేశారు.

ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీరణ చేయనున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ విమర్శలపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. గతంలో ప్రజలను దోచుకున్న పార్టీ టీడీపీ అని విమర్శించారు. చంద్రబాబు హయాంలో నిజాం షుగర్ పరిశ్రమను ఎత్తివేయలేదా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడే హక్కు టీడీపీకి లేదని మండిపడ్డారు.

కరోనా సమయంలో పొరుగు రాష్ట్రంలో కూర్చుని ట్వీట్లు చేసే వ్యక్తులు.. బీజేపీ గురించి మాట్లాడడమేంటని ఎద్దేవా చేశారు. జూమ్ యాప్ లో ప్రసంగాలు చేసే పెద్దమనిషి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాడని, తెలుగు చదవడమే రాని వ్యక్తి ట్వీట్లు చేస్తున్నాడని లోకేష్‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం అంశంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more:

ఆ యువకుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి.. జాతీయ ఎస్సీ కమిషన్‌కు నారా లోకేష్‌ లేఖ