Google: మరో విప్లవాత్మక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్న టెక్ దిగ్గజం.. ఇకపై స్మార్ట్ ఫోన్‌తోనే హృదయ స్పందన…
గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ఫీచర్ ద్వారా.. మనిషి ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే...
Google Pixel Phones Read Your Heart Rate: ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినియోగదారుడికి కొత్త అనూభూతిని అందించేందుకు కృషి చేస్తుంది కాబట్టే గూగుల్‌కు ప్రపంచ వ్యాప్తంగా అంతటి ప్రాముఖ్యత ఉంది. టెక్నాలజీని అందిపుచ్చుకునే ఈ టెక్ దిగ్గజం తాజాగా మరో కొత్త ఫీచర్‌తో రానుంది. వివరాల్లోకి వెళితే.. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ఫీచర్ ద్వారా.. మనిషి ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే హార్ట్ బీట్, శ్వాసకోశ రేటును అరచేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా తెలసుకోవచ్చని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న గూగుల్ ఫిట్ యాప్‌లో ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆప్టికల్ ఫ్లోగా పిలిచే కంప్యూటర్ విజన్ టెక్నిక్‌ను ఉపయోగించి శ్వాసకోశ రేటును తెలుసుకోవచ్చని చెబుతున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ కెమెరాతో వ్యక్తిని స్కాన్ చేస్తే చాలు సదరు వ్యక్తి శ్వాసకోశ రేటును, అలాగే మొబైల్ ఫోన్ బ్యాక్ కెమెరా లెన్స్‌పై బొటన వేలు పెట్డం ద్వారా హార్ట్ బీట్‌ను తెలుసుకోవచ్చని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం కేవలం పిక్సెల్ ఫోన్లలోనే ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.