ISRO: చంద్రుడి ఉపరితలంపై తిరుగుతోన్న చంద్రయాన్-2 ఆర్బిటార్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.? కీలక ప్రకటన చేసిన ఇస్రో..
ISRO Shares Chandrayan-2 Information: భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) గతేడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. యావత్ దేశం ఈ ప్రయోగం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసింది. చివరికి..
ISRO Shares Chandrayan-2 Information: భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) గతేడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. యావత్ దేశం ఈ ప్రయోగం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసింది. చివరికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ప్రయోగాన్ని చూడడానికి శ్రీహరికోటకు స్వయంగా హాజరయ్యారు. అయితే చంద్రయాన్-2 దాదాపు విజవయవంతమవుతోందన్న సమయంలో విఫలమైంది. 2019 జులై 22న ఈ ప్రయోగం నిర్వహించగా. సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలపై దిగుతూ కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్‌తో భూకేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. దీంతో విక్రమ్ క్రాష్ ల్యాండింగ్ కావడంతో ల్యాండర్, అందులోని రోవర్ ధ్వసంమయ్యాయి. అయితే.. ఈ ప్రయోగంలో పంపిన ఆర్బిటర్ మాత్రం ఇంకా చంద్రుడి ఉపరితలం చుట్టూ తిరుగుతూనే ఉంది. చంద్రుడి ఉపరితలంపై సమాచారాన్ని భూమిపైకి పంపిస్తూనే ఉంది. తాజాగా ఈ ఆర్టిబర్ ఇస్రో డేటా సెంటర్‌కు సమాచారం పంపింది. ప్రస్తుతం ఆర్బిటర్‌లో అన్ని పరికరాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఇస్రో శాస్ర్తవేత్తలు తెలిపారు. చంద్రయాన్-2 మరో ఏడేళ్లు నిర్విరామంగా పనిచేయడానికి సరిపడా ఇంధనం ఉందని గుర్తించారు. ఇదిలా ఉంటే అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుడి ఉపరితలంపైకి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపిన నాలుగో దేశంగా భారత్ అవతరించిన విషయం తెలిసిందే.
Also Read: Google Meet: సరికొత్త ఫీచర్ తీసుకురానున్న గూగుల్ మీట్.. ఇకపై ఆడియో, వీడియో కాల్స్ చేసే ముందే..