Xiaomi: సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిన షావోమి… దీంతో కేవలం పది నిమిషాల్లోనే..
Xiaomi Introduce New Charging Technology: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ల తయారీలోనూ మార్పు వస్తోంది. మరీ ముఖ్యంగా కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండడంతో రకరకాల ఫీచర్లతో..
Xiaomi Introduce New Charging Technology: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ల తయారీలోనూ మార్పు వస్తోంది. మరీ ముఖ్యంగా కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండడంతో రకరకాల ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పోటీలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ.. షావోమి ముందు వరుసలో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సరికొత్త టెక్నాలజీతో వినియోగదారులను ఆకర్షించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి కాలంలో ఫాస్ట్ చార్జింగ్ విషయంలో కంపెనీలు వినూత్న సాంకేతికతను తీసుకొస్తున్నాయి. మొబైల్ ఫోన్‌ను వేగంగా ఛార్జింగ్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయి. తాజాగా షావోమి 200W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఈ సరికొత్త టెక్నాలజీతో మొబైల్ ఫోన్‌ను 10 నిమిషాల్లోనే ఛార్జ్ చేయొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ టెక్నాలజీని ఈ ఏడాదిలోనే తీసుకురానున్నారని సమాచారం. ఎంఐ ఫోల్డబుల్ పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్న షావోమి.. ఆ మైబైల్‌తోనే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.