Google Meet: సరికొత్త ఫీచర్‌ తీసుకురానున్న గూగుల్‌ మీట్‌.. ఇకపై ఆడియో, వీడియో కాల్స్‌ చేసే ముందే..

New Feature In Google Meet: కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో దాదాపు అన్ని సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్ని అవలంభించాయి. అప్పటి వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్ని అమలు చేయని కంపెనీలు కూడా...

Google Meet: సరికొత్త ఫీచర్‌ తీసుకురానున్న గూగుల్‌ మీట్‌.. ఇకపై ఆడియో, వీడియో కాల్స్‌ చేసే ముందే..
Follow us

|

Updated on: Feb 04, 2021 | 11:13 PM

New Feature In Google Meet: కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో దాదాపు అన్ని సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్ని అవలంభించాయి. అప్పటి వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్ని అమలు చేయని కంపెనీలు కూడా ఈ విధనాన్ని అనుసరించక తప్పలేదు. దీంతో టీమ్‌ వర్క్‌గా పనిచేసే ఉద్యోగులు పలు సాఫ్ట్‌వేర్‌ల సహాయంతో ఒకేసారి అందరూ కలిసి ఆడియో, వీడియో కాల్స్‌ మాట్లాడుతూ పనులు చక్కబెట్టుకుంటన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో కాల్‌ అటెండ్‌ చేసే సమయంలో మనం ఉన్న ప్రదేశంలో లైటింగ్ సరిగా ఉండకపోవచ్చు, మనం మాట్లాడే ఆడియో ఎదుటి వ్యక్తులకు వినిపించకపోయే అవకాశాలుంటాయి. అచ్చంగా ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టడానికే ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌కు చెందిన ‘గూగుల్‌ మీట్‌’ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో కాల్‌ చేసే ముందే వీడియో, ఆడియో స్పష్టంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ‘గ్రీన్‌ రూమ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ద్వారా వీడియో కాల్‌లో జాయిన్‌ అయ్యే ముందే మన ఆడియో, వీడియోను ప్రివ్యూ చూసుకునే సౌకర్యాన్ని కల్పించారు. అంతేకాకుండా దీని ద్వారా లైటింగ్‌ సెట్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం మాట్లాడడానికి ఉపయోగించే మైక్‌ సరిగా సెట్‌ చేసి ఉందా..? నెట్‌వర్క్‌ వీడియో కాల్‌కు సరిపోతుందా.? వంటి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా యూజర్లు గూగుల్‌ మీట్‌ ద్వారా ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Also Read: స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ఇస్రోల మధ్య కీలక ఒప్పందం.. తేలికపాటి ఉపగ్రహాల అభివృద్ధికి సహకారం

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..