Instagram: మరో కొత్త ఫీచర్ తీసుకురానున్న ఇన్‌స్టాగ్రామ్… ఇకపై ఇన్‌స్టా స్టోరీస్ వీడియోలను…
Instagram New Feature: సోషల్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకెళుతోంది ఇన్‌స్టాగ్రామ్. ఇతర కంపెనీల నుంచి పెరుగుతోన్న పోటీని తట్టుకునే క్రమంలో సరికొత్త ఫీచర్లతో...
Instagram New Feature: సోషల్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకెళుతోంది ఇన్‌స్టాగ్రామ్. ఇతర కంపెనీల నుంచి పెరుగుతోన్న పోటీని తట్టుకునే క్రమంలో సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానో కొంగొత్త ఆప్షన్లను పరిచయం చేస్తోంది.
కొన్ని రోజుల క్రితమే… డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలను తిరిగి పొందడానికి ‘రీసెంట్లీ డిలీటెడ్’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆప్షన్ ద్వారా నెల రోజుల పాటు డిలీట్ చేసిన ఫొటోలను తిరిగి పొందవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది ఇన్‌స్టాగ్రామ్. తాజాగా ఇన్‌స్టా స్టోరీల్లో వీడియోలను ఇకపై వర్టికల్ (నిలువు)గా చూసుకునే అవకశాన్ని కల్పించనున్నారు. అంటే టిక్‌టాక్ యాప్‌లో ఉండే తరహా ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తీసుకురానున్నారు. ఈ ఫీచర్ వల్ల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లాగే ఇన్‌స్టా స్టోరీలను కూడా చూడొచ్చు. ఇదిలా ఉంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌కు యూజర్లు పెద్ద ఎత్తున పెరిగారు.
#Instagram is working on Vertical Stories ? Swipe up and down to browse stories. pic.twitter.com/LDJje8l137
— Alessandro Paluzzi (@alex193a) February 2, 2021