AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: దానిమ్మ పండు… పోషకాలు మెండు.. దీని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా..?

Health Benefits With Pomegranate: కాలంతో సంబంధం లేకుండా ప్రతీ సీజన్‌లో అందుబాటులో ఉండే పండ్లలో దానిమ్మ ఒకటి. చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ పండుతో అంతే ప్రయోజనాలుంటాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని...

Health: దానిమ్మ పండు... పోషకాలు మెండు.. దీని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా..?
Narender Vaitla
|

Updated on: Feb 07, 2021 | 5:51 AM

Share

Health Benefits With Pomegranate: కాలంతో సంబంధం లేకుండా ప్రతీ సీజన్‌లో అందుబాటులో ఉండే పండ్లలో దానిమ్మ ఒకటి. చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ పండుతో అంతే ప్రయోజనాలుంటాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే దానిమ్మ గింజలతో ఆరోగ్యానికి జరిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* దానిమ్మ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది.

* ఈ పండులో ఉండే సుగుణాలు అల్జీమర్స్‌, రొమ్ము, చర్మ క్యాన్సర్లకు అడ్డుకట్టవేస్తుంది.

* గుండె జబ్బులకు చెక్‌ పెట్టడానికి కూడా దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. రోజుకో గ్లాసు దానిమ్మ రసం తాగితే హృదయ సంబంధిత రోగాలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.

* గర్భిణీలు కచ్చితంగా దానిమ్మను ఆహారంలో ఓ భాగం చేసుకోవాలి. దీనివల్ల గర్భస్త శిశువు బాగా ఎదుగుతుంది.

* ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.

* దానిమ్మపండులో ఉండే పోషక విలువలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఈ కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం తప్పించుకోవచ్చు.

* దానిమ్మ పండు కేవలం ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. దానిమ్మ రసంలో ఒక స్పూన్‌ పంచదార, ఒక స్పూన్‌ తేనె వేసిన ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

* పైల్స్‌ సమస్యకు కూడా దానిమ్మ మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం దానిమ్మ గింజలకు కొంచెం ఉప్పును కలుపుకొని తింటే.. పైల్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

Also Read: Benefits of Black Pepper: పోపుల పెట్టె ఔషధాల గని… నల్ల మిరియాలతో కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి