Pear Fruits
Pear Health Benefits: పియర్ ఒక సాధారణ పండుగా భావించి చాలా మంది దీనిని తినరు. బహుశా అలాంటి వారికి బేరిపండు ప్రయోజనాల గురించి తెలియకపోవచ్చు. పియర్ అనేది కాలానుగుణంగా లభించే పండు. వేసవిలో ఆరోగ్యం మెరుగుపడాలంటే మామిడి పండ్లను తీసుకున్నట్లే.. వర్షాకాలంలో పియర్ పండును తప్పనిసరిగా తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వర్షాకాలంలో రోజంతా బ్యాక్టీరియా రహితంగా, తాజాదనాన్ని అందించే పియర్ చాలా ముఖ్యమైన పండు అని పేర్కొన్నారు. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాల వ్యాధులను అధిగమించవచ్చు. ఆయుర్వేదంలో కూడా దీనికి భిన్నమైన స్థానం ఉంది. కావున ఏయే వ్యాధులకు బేరిపండు దివ్యౌషధమో ఇప్పుడు తెలుసుకుందాం..
- ఇమ్యూనిటీ: ఈ రోజుల్లో రకరకాల వైరస్ లు వ్యాపిస్తున్నాయి. ఇవి మన రోగనిరోధక శక్తిపై చెడు ప్రభావం చూపుతున్నాయి. దీంతో మనం అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నాం. అటువంటి పరిస్థితిలో, బేరిని ఖాళీ కడుపుతో ప్రతిరోజూ తినడం చాలామంచిది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- ఊబకాయం: ఈ రోజుల్లో ప్రజలు స్థూలకాయంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రకరకాల డైట్స్ చేసినా, గంటల తరబడి జిమ్ చేసినా ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. అటువంటి వారికి ఈ ఈ పండు సర్వరోగ నివారిణిగా పేర్కొంటున్నారు. మీరు కూడా పెరిగిన బరువుతో ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా మీ ఆహారంలో పియర్‌ను భాగం చేసుకోండి. ఇందులో ఉండే మూలకాలు మీ బరువును రెండింతలు వేగంగా తగ్గించడంలో సహాయపడతాయి.
- గుండెకు దివ్యౌషధం: చాలామందికి పొగతాగడం, మద్యం తాగడం లాంటి చెడు అలవాట్లు సాధారణంగా ఉంటుంది. ఇవి కిడ్నీ, మన గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఆరోగ్యంగా ఉంచడానికి పియర్ అత్యంత ప్రయోజనకరమైనదిగా పేర్కొంటున్నారు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది. దీని వినియోగం రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి