Bitter Gourd Tea: కాకరకాయ టీతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు..

| Edited By: Janardhan Veluru

Aug 19, 2022 | 10:43 AM

Bitter Gourd Tea Benefits: కాకరకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇతరత్రా అనారోగ్యాలు దరి చేరవు.

Bitter Gourd Tea: కాకరకాయ టీతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.. అస్సలు విడిచిపెట్టరు..
Bitter Gourd Tea
Follow us on

Bitter Gourd Tea : కాకరకాయ.. సాధారణంగా మనం అంతగా ఇష్టపడని కూరగాయలలో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే..దీనిలో ఉండే చేదు కారణంగా కాకరకాయను చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ, దీనిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఎన్నో ఉన్నాయి. అవి తెలిసినా కూడా మనం కాకరకాయను ఇష్టపడం..అలాంటి వారి కోసమే ఇప్పుడు కాకరకాయ టీ వచ్చింది. కాకర కాయల కూర తినలేనివారికి ఇదొక ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు.

కాకరకాయల టీని ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలున్నాయి. క్యాన్సర్ ని సైతం దూరం చేస్తుంది ఈ కాకర కాయల టీ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, కొత్తగా వింటున్న ఈ కాకరకాయ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కాకర కాయలను ముక్కలు చేసుకుని ఎండబెట్టుకోవాలి.. ఎండిన ముక్కలను నీళ్లలో వేసి వేడిచేయాలి. ఓ పావు గంటసేపు బాగా మరిగించిన తర్వాత ఆ కాకర కాయల రసాన్ని వేరు చేసి దానికి తేనె, నిమ్మరసం కలిపాలి తాగాలి… ఈ మూడింటి మిశ్రమాన్ని నిత్యం తాగితే బీపీ సమస్య తగ్గుతుంది. షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. అధిక బరువుతో బాధపడేవారు సన్న బడతారు. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇంకా కాకర కాయల టీ ప్రాణాంతక క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. అందువల్ల రోజూ ఈ తేనీరు తాగితే క్యాన్సర్ జబ్బును ముందే అరికట్టవచ్చు. కాకర కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇతరత్రా అనారోగ్యాలు దరి చేరవు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి