Jogging Benefits: రోజూ అరగంట జాగింగ్ చేస్తే ఆరోగ్యం, అందం మన సొంతం అవుతుంది!

వ్యాయామంలో ఒక భాగం జాగింగ్. ఉదయాన్నే వాకింగ్ చేస్తే కలిగే లాభాల గురించి అందరికీ తెలుసు. కానీ జాగింగ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మరీ ఎక్కువగా పరిగెత్తకుండా.. నెమ్మదిగా అడుగులో అడుగులు వేస్తూ పరిగెడుతూ చేస్తే అదే జాగింగ్. ప్రతి రోజు ఉదయం ఏదైనా ఒక ఎక్సర్ సైజ్ చేస్తే చాలా మంచిది. కొంత మంది జిమ్ కి వెళ్తారు. మరి ఇంకొంత మంది వాకింగ్ చేస్తూంటారు. అలా కొంతమంది జాగింగ్ చేస్తూంటారు. రోజూ ఉదయం జాగింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్న సంగతి ఎక్కువ మందికి తెలీదు. జాగింగ్ చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సొంతం..

Jogging Benefits: రోజూ అరగంట జాగింగ్ చేస్తే ఆరోగ్యం, అందం మన సొంతం అవుతుంది!
Jogging

Edited By: Ravi Kiran

Updated on: Oct 05, 2023 | 7:30 PM

వ్యాయామంలో ఒక భాగం జాగింగ్. ఉదయాన్నే వాకింగ్ చేస్తే కలిగే లాభాల గురించి అందరికీ తెలుసు. కానీ జాగింగ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మరీ ఎక్కువగా పరిగెత్తకుండా.. నెమ్మదిగా అడుగులో అడుగులు వేస్తూ పరిగెడుతూ చేస్తే అదే జాగింగ్. ప్రతి రోజు ఉదయం ఏదైనా ఒక ఎక్సర్ సైజ్ చేస్తే చాలా మంచిది. కొంత మంది జిమ్ కి వెళ్తారు. మరి ఇంకొంత మంది వాకింగ్ చేస్తూంటారు. అలా కొంతమంది జాగింగ్ చేస్తూంటారు. రోజూ ఉదయం జాగింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్న సంగతి ఎక్కువ మందికి తెలీదు. జాగింగ్ చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. కనీసం ఓ 30 నిమిషాలు జాగింగ్ చేయడం వల్ల కండరాలు బలంగా, దృఢంగా తయారవ్వడమే కాకుండా.. స్కిన్ మెరుస్తూ ఉంటుంది. మరి జాగింగ్ తో ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.

స్కిన్ మెరుస్తుంది:

ఉదయం లేవగానే కొన్ని వాటర్ తాగి జాగింగ్ చేయడం వల్ల బాడీ మొత్తం ఎక్సర్ సైజ్ చేసినట్టు ఉంటుంది. దీంతో చర్మం కూడా హెల్దీగా ఉంటుంది. స్కిన్ లో ఒక లాంటి గ్లో వస్తుంది. దీని వల్ల మీరు యంగ్ గా కనిపిస్తారు.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గుతారు:

జాగింగ్ చేయడం వల్ల శరీరం అంతా కదులుతుంది. దీంతో అదనపు భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. జాగింగ్ తో పాటు మంచి హెల్దీ డైట్ ని పాటిస్తే మాత్రం ఖచ్చితంగా పది కిలోల వరకూ బరువు తగ్గొచ్చు.

ఒత్తిడి తగ్గుతుంది:

రోజూ ఉదయం జాగింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, నిరాశ వంటి వాటిని దూరం చేసుకోవచ్చు. జాగింగ్ చేయడం వల్ల రక్త కణాలు యాక్టీవ్ అవుతాయి. దీంతో మెదడుకు రక్త సరఫరా కూడా సాఫీగా ఉంటుంది. ఈ క్రమంలో బ్రెయిన్ కూడా యాక్టీవ్ గా మారుతుంది.

ఇమ్యూనిటీ పెరుగుతుంది:

ప్రతి రోజు అరగంట జాగింగ్ చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. బాడీలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది.

ప్రశాంతంగా నిద్ర పడుతుంది:

చాలా మంది నిద్ర లేమి సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారు ఉదయాన్నే లేచి జాగింగ్ చేయడం వల్ల నిద్ర లేమి సమస్యల నుంచి దూరం అవ్వొచ్చు. వ్యాయామాలు చేయడం వల్ల రాత్రుళ్లు బాగా నిద్ర పడుతుంది.

షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి:

డయాబెటీస్ తో బాధ పడుతున్నారు ప్రతి రోజు ఉదయం జాగింగ్ చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఉదయాన్నే జాగింగ్ చేయడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అంతే కాకుండా జన్యు పరంగా వచ్చే మధు మేహాన్ని కూడా అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి షుగర్ తో బాధ పడేవారు ఉదయాన్నే జాగింగ్ చేస్తే చక్కటి ఫలితాలు పొందవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.