Happy Holi: రంగుల కేళికి చిన్నారులు రెడీ.. మీ పిల్లల సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు మీ కోసం..

|

Mar 02, 2023 | 12:26 PM

ఈ హొలీలో రసాయన గులాల్ పౌడర్ వాడకం, చిన్న చిన్న ఘర్షణలు, వాటర్ బెలూన్ల, వాటర్ గన్స్ వంటివి ప్రధానంగా చోటు చేసుకుంటాయి. అయితే చిన్న పిల్లలు రంగులు జల్లుకునే సమయంలో కొంతమేర ఆందోళన చెందాల్సి ఉందని.. తల్లిదండ్రులు తమ పిల్లలకు సురక్షితమైన హొలీ సంబరాలను అందించాలని నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

Happy Holi: రంగుల కేళికి చిన్నారులు రెడీ.. మీ పిల్లల సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు మీ కోసం..
Safe Holi For Children
Follow us on

రంగుల పండుగ హోలీ పండగను ఈ నెల 8వ తేదీన జరుపుకోవడానికి పిల్లలు, పెద్దలు రెడీ అవుతున్నారు.  వసంత కాలంలో వచ్చే ఈ హోలీ పండుగ ప్రతి ఇంట్లో ఆనందాన్ని తీసుకొస్తుంది. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు వచ్చే ఈ పండుగను హోలీ పండగ అని కొందరు.. కాముని పున్నమి మరికొందరు అంగరంగ వైభంగా జరుపుకుంటారు. పెద్దలు పిల్లల్లా మారి జరుపుకునే ఈ పండగ కోసం పిల్లలు ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తారు. హొలీ రోజున తమ స్నేహితులను రంగులతో ముంచి తేలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ హొలీలో రసాయన గులాల్ పౌడర్ వాడకం, చిన్న చిన్న ఘర్షణలు, వాటర్ బెలూన్ల, వాటర్ గన్స్ వంటివి ప్రధానంగా చోటు చేసుకుంటాయి. అయితే చిన్న పిల్లలు రంగులు జల్లుకునే సమయంలో కొంతమేర ఆందోళన చెందాల్సి ఉందని.. తల్లిదండ్రులు తమ పిల్లలకు సురక్షితమైన హొలీ సంబరాలను అందించాలని నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. మీ పిల్లలు సురక్షితంగా, సంతోషకరమైన హోలీని ఆస్వాదించాలని.. కోరుతున్నారా.. పిల్లల సంరక్షణ కోసం కొన్ని చిట్కాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

వాటర్ గన్ ను సురక్షితంగా ఉపయోగించండి:

హొలీ పర్వదినం సంతోషంగా జరుపుకోవడానికి వాటర్ గన్స్ ముఖ్యపాత్రను పోషిస్తాయి. వీటితో ఒకరిపై ఒకరు రంగులను జల్లుకోవడం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే.. వాటర్ గన్ ను ఉపయోగించి ముఖం, చెవులు లేదా నోటిపై రంగులు చల్లడం ప్రమాదకరం అని పిల్లలు అర్థం చేసుకునే విధంగా చెప్పాలి.

ఇవి కూడా చదవండి

సహజ రంగుల వినియోగం: 

సింథటిక్ రంగులు హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని చికాకుపరుస్తాయి. దద్దుర్లు, అలెర్జీలకు కారణమవుతాయి. స్కిన్-ఫ్రెండ్లీ ఆర్గానిక్ హోలీ రంగులు మృదువుగా ఉంటాయి. అంతేకాదు సహజ రంగులను ఈజీగా తొలగించుకోవచ్చు. గులాబీ, బంతి పువ్వులు, గంధపు చెక్క, గోరింట, పసుపు వంటి వాటి నుంచి తయారు చేసే సహజ రంగులు శ్రేష్టమైనవి.

నీటి బుడగలు:

రంగు రంగుల నీటితో నిండిన బెలూన్లతో ఆడుకోవడం సరదాగా ఉంటాయి. అయినప్పటికీ అవి ఒకొక్కసారి పిల్లలకు ప్రమాదకరంగా మారతాయి. నీటి బెలూన్ అనుకోకుండా కళ్ళు వంటి సున్నితమైన శరీర భాగాన్ని తాకినప్పుడు కంటి చూపు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కనుక పిల్లలు నీటి బెలూన్లతో ఆడుకునే సమయంలో పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

పిల్లలకు ఇలా హోలీ డ్రెస్ సిద్ధం చేయండి:

పిల్లలు సింథటిక్ రంగులతో ఆడుకునే సమయంలో హానికరం కాకుండా.. వాటి ప్రభావాన్ని తగ్గించడానికి పిల్లలకు కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌజ్ సహా శరీరం అంతా కప్పే విధంగా దుస్తులను ధరింపజేయండి. అలాగే రసాయనాల రంగుల నుంచి పిల్లల్ని  రక్షించడానికి జుట్టు, ముఖం సహా మొత్తం శరీరానికి నూనె రాయండి.

పిల్లల పట్ల శ్రద్ధ వహించండి:
పిల్లలు హోలీ ఆడుతున్నప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే పిల్లలు ఆడేటప్పుడు అనుకోకుండా రంగులు కళ్ళు, చెవుల్లో పడడం జరగవచ్చు. ఒకొక్కసారి రంగులు ప్రాణాంతక అంటువ్యాధులకు కారణం అవచ్చు. కనుక హొలీ ఆడుతున్న సమయంలో పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.