AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. యమ డేంజరంట.. చిగుళ్ళ నుంచి రక్తస్రావం గుండె జబ్బుల లక్షణమా..?

తరచుగా మన చిగుళ్ళ నుండి రక్తం కారుతుంది. ఇది అనేక కారణాల వల్ల జరగవచ్చు. గుండె జబ్బులు కూడా దీనికి కారణం కావచ్చు. ఎటువంటి కారణం లేకుండా చిగుళ్ళు ఎందుకు రక్తస్రావం అవుతుంది. దీని వెనుక కారణం ఏమిటి? నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు.. వివరాలను తెలుసుకోండి..

వామ్మో.. యమ డేంజరంట.. చిగుళ్ళ నుంచి రక్తస్రావం గుండె జబ్బుల లక్షణమా..?
Bleeding Gums
Shaik Madar Saheb
|

Updated on: Jun 21, 2025 | 4:56 PM

Share

కొన్నిసార్లు చిగుళ్ళ నుంచి అకస్మాత్తుగా రక్తస్రావం మొదలవుతుంది. చిగుళ్ళ నుంచి రక్తస్రావం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు దంత వ్యాధి కారణంగా చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంది. దీనితో పాటు, ఇది అనేక ఇతర తీవ్రమైన వ్యాధులకు కూడా సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిగుళ్ళ నుంచి రక్తస్రావం వెనుక అనేక ఇతర కారణాలు ఉన్నాయని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చిగుళ్ళ నుంచి రక్తస్రావం ఏదైనా గుండె జబ్బుల లక్షణమా? నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు.. వివరాలను తెలుసుకోండి..

చిగుళ్ళ నుంచి అకస్మాత్తుగా రక్తస్రావం అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ఇది ఏదైనా దంత వ్యాధి లేదా గాయం వల్ల కూడా సంభవించవచ్చు. గుండె సంబంధిత వ్యాధులు కూడా చిగుళ్ళ నుండి రక్తస్రావం కావడానికి ఒక కారణం కావచ్చు. చిగుళ్ళ నుండి రక్తస్రావం తేలికగా తీసుకోకూడదు. ఎటువంటి కారణం లేకుండా చిగుళ్ళు రక్తస్రావం అవుతుంటే, నిర్లక్ష్యంగా ఉండకూడదు.. దాని కారణాలను కనుగొని చికిత్స తీసుకోవాలి..

గుండె జబ్బులలో చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరుగుతుందా..

లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలోని డెంటల్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడి డాక్టర్ ప్రవేశ్ మెహ్రా మాట్లాడుతూ.. చిగుళ్ల నుండి రక్తస్రావం కూడా గుండె సంబంధిత వ్యాధి లక్షణం కావచ్చని చెప్పారు. అయితే, ఇది ఎల్లప్పుడూ గుండె జబ్బుకు సంకేతం కాదు. చిగుళ్ల నుండి రక్తస్రావం అనేది పీరియాంటల్ వ్యాధి సాధారణ లక్షణం.. ఇది గుండె జబ్బుతో ముడిపడి ఉంటుంది. చిగుళ్ల వ్యాధిలో, నోటిలో ఉండే బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి మంట – గుండెకు నష్టం కలిగిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే, చిగుళ్ల నుండి రక్తస్రావం మీకు గుండె జబ్బు ఉందని నిర్ధారించదు.. ఇది చిగుళ్ల వ్యాధి లక్షణం మాత్రమే కావచ్చు, ఇది ఒక సాధారణ సమస్య.. అని తెలిపారు.

ఏం చేయాలి..

మీ చిగుళ్ళ నుంచి ఎటువంటి కారణం లేకుండా రక్తస్రావం అవుతుంటే, మీరు దానిని తనిఖీ చేసుకోవాలి. పరీక్ష తర్వాత మాత్రమే చిగుళ్ళ నుండి రక్తస్రావం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటో నిర్ణయించబడుతుంది. చిగుళ్ళ నుండి రక్తస్రావం గుండె సంబంధిత వ్యాధి వల్ల అయితే, దానిని గుర్తించి చికిత్స చేయవచ్చు. చిగుళ్ళు వేరే కారణం వల్ల రక్తస్రావం అవుతుంటే, ఆ కారణాలను కనుగొని వాటికి కూడా చికిత్స చేయడం ముఖ్యం.. అని వైద్య నిపుణులు సూచించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?