Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gut Health: స్త్రీలకు పేగుల్లో సమస్యలుంటే పిల్లలు పుట్టరా? నిపుణులు చెబుతుందేంటి?

వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం ఎందుకంటే ఆరోగ్యకరమైన ప్రేగుల నిర్వహణ కూడా సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కానీ, చాలా సమయాల్లో మాత్రం డాక్టర్లు ఈ విషయాన్ని విస్మరిస్తుంటారు. మన జీర్ణాశయం అనేక రకాల బ్యాక్టీరియాలతో నిండి ఉంటుంది. ఇది స్త్రీలల్లో పునరుత్పత్తి వాతావరణాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది.

Gut Health: స్త్రీలకు పేగుల్లో సమస్యలుంటే పిల్లలు పుట్టరా? నిపుణులు చెబుతుందేంటి?
Pregnancy
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Jan 18, 2023 | 8:00 AM

ఆడవాళ్లకు అమ్మతనం మించిన సంతోషం మరొకటి ఉండదు. చాలా కాపురాల్లో సంతానోత్పత్తి సమస్యల వల్ల విడాకులకు కూడా కారణం అవుతుంది. అయితే స్త్రీలల్లో పిల్లలు కలగకపోవడానకి వివిధ కారణాలు ఉంటాయి. అయితే ఆ కారణాల్లో పేగుల ఆరోగ్యం కూడా ఒకటి. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం ఎందుకంటే ఆరోగ్యకరమైన ప్రేగుల నిర్వహణ కూడా సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కానీ, చాలా సమయాల్లో మాత్రం డాక్టర్లు ఈ విషయాన్ని విస్మరిస్తుంటారు. మన జీర్ణాశయం అనేక రకాల బ్యాక్టీరియాలతో నిండి ఉంటుంది. ఇది స్త్రీలల్లో పునరుత్పత్తి వాతావరణాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. బాక్టీరియా హార్మోన్ల సమతుల్యత, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, జీర్ణక్రియ, పోషకాలను శోషణ చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ పిండం నాణ్యత మరియు పునరుత్పత్తి వాతావరణానికి తోడ్పడతాయి.

సంతానోత్పత్తిపై ప్రభావం చూపే అంశాలు

  • మనం పోషకాలను సరిగ్గా జీర్ణం చేయకపోయినా లేదా గ్రహించకపోయినా అవి హార్మోన్లను నిర్మించలేవు. కాబట్టి పరిపక్వమైన గుడ్డు లేదా స్పెర్మ్ డీఎన్ఏ ప్రోగ్రామింగ్‌కు మద్దతు ఇవ్వలేవు. 
  • ఈస్ట్రోజెన్ బ్యాలెన్స్ మన గట్‌లోని బ్యాక్టీరియా, ఎంజైమ్ లతో నియంత్రించబడుతుంది. ఇది మన మలం ద్వారా కూడా తొలగిస్తుంది. కానీ జీర్ణం అవ్వడానికి బాగా సమయం పడితే  ఈస్ట్రోజెన్ బ్యాలెన్స్ తో జీర్ణం అవ్వడానికి సాయం చేస్తుంది. అధిక ఈస్ట్రోజెన్, తక్కువ ప్రొజెస్టెరాన్ సంకేతాలు ఉంటే అది సంతానోత్పత్తి సమస్యలకు కారణం అవుతుంది. 
  • మన రోగనిరోధక వ్యవస్థలో డెబ్బై శాతం గట్‌లోని బ్యాక్టీరియా ద్వారా ప్రభావితమవుతుంది. ఆరోగ్యకరమైన వాపు మరియు పిండం యొక్క ఇంప్లాంటేషన్‌కు మద్దతు ఇవ్వడానికి రోగనిరోధక పనితీరు కీలకం. అలాగే, మీ రోగనిరోధక వ్యవస్థ మీ భవిష్యత్ శిశువుల రోగనిరోధక వ్యవస్థను నిర్మిస్తుంది. కాబట్టి కచ్చితంగా పేగు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఫైబర్, హైడ్రేషన్ మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన పేగు నిర్వహణకు కచ్చితంగా మంచి ఆహారాలను తినాలి. అదే విధంగా కచ్చితంగా హైడ్రేషన్ కు గురికాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.

లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..