Drumstick 2

మునగ జ్యూస్‌ ఎప్పుడైనా తాగారా? ఆ రోగాలకు దివ్యౌషధం..

29 March 2025

image

TV9 Telugu

కూరగాయలతోపాటు రెండుమూడు మునక్కాయల్ని తెచ్చుకున్నా... సాంబారులో వేస్తాం లేదంటే ఇగురులా చేసుకుని రుచులు ఆస్వాదిస్తాం. ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే మునక్కాయ, మునగాకు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా బలేగా మేలు చేస్తాయి

మునగ ఆకులు, గింజలు, కాయలు తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయన్న సంగతి తెలిసిందే. అదే మునక్కాయ రసం మీరెప్పుడైనా తాగారా? ఎన్ని లాభాలో తెలుసా..

TV9 Telugu

మునగ ఆకులు, గింజలు, కాయలు తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయన్న సంగతి తెలిసిందే. అదే మునక్కాయ రసం మీరెప్పుడైనా తాగారా? ఎన్ని లాభాలో తెలుసా..

మునగలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర వ్యాధి నిరోధకతను పెంచుతాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పరుస్తాయి

వీటితోపాటు విటమిన్‌-ఎ, సి, ఇ, కాల్షియం, పొటాషియం, ఐరన్‌, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి

TV9 Telugu

ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించడంలో మునగ సహాయపడుతుంది. మునగ జ్యూస్‌ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఐసోథియోసైనేట్లు రక్తంలో చక్కెరను సమతుల్యం చేస్తాయి. ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి

TV9 Telugu

అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారికి మునగ జ్యూస్‌ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి

TV9 Telugu

మునగ రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వం, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి కూడా పనిచేస్తుంది

TV9 Telugu

బరువు తగ్గాలనుకుంటే మునగ జ్యూస్ ఒక గొప్ప ఎంపిక. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలో కొవ్వును కాల్చే ప్రక్రియను పెంచుతుంది