వామ్మో.. మీకు ఈ 4 సమస్యలున్నాయా..? నెయ్యి తింటే ఇక షెడ్డుకేనట..
భారతదేశంలోని దాదాపు ప్రతి ఇంట్లో నెయ్యి వినియోగిస్తారు. దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ నెయ్యి తినడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సమస్యలు ఉన్న వారు నెయ్యికి దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అనేక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు.

భారతీయ ఆహారంలో నెయ్యి వాడకం చాలా సాధారణం.. దాదాపు ప్రతి ఇంట్లోనూ రోజువారీ ఆహారంలో కమ్మగా నెయ్యి కలుపుకుని తింటారు.. ఇంకా రోటీ, చట్నీలలో కూడా నెయ్యిని ఉపయోగిస్తారు.. ఆహారానికి నెయ్యిని జోడించడం వల్ల దాని రుచి రెట్టింపు అవుతుంది. అయితే.. ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉన్న నెయ్యిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. కానీ కొన్ని సందర్భాల్లో, నెయ్యి తినడం వల్ల కూడా ప్రతికూలతలు కలిగే అవకాశం ఉంది.. ఎవరైన వ్యక్తి కొన్ని వ్యాధులతో బాధపడుతుంటే నెయ్యి తినకుండా ఉండటం మంచిది. ఈ కథనంలో నెయ్యి దుష్ప్రభావాలు ఏంటి..? ఎలాంటి వారు నెయ్యి తినకూడదు.. ఎలాంటి సమస్యలు ఉన్న నెయ్యికి దూరంగా ఉండాలి.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నెయ్యి తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
నెయ్యి తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. దీన్ని ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ కేలరీలు చేరుతాయి.. ఇది బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. నెయ్యిలో సంతృప్త కొవ్వు ఉంటుంది.. ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది. అధిక నెయ్యి అజీర్ణం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
అధిక కొలెస్ట్రాల్
నెయ్యిలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఒక వ్యక్తికి అధిక కొలెస్ట్రాల్ ఉంటే, నెయ్యి తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
అధిక రక్తపోటు
నెయ్యిలో సోడియం ఎక్కువగా ఉండదు.. కానీ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగవచ్చు.. ఇది రక్తపోటును ప్రభావితం చేస్తుంది. మీకు అధిక రక్తపోటు ఉంటే, నెయ్యి వినియోగం పరిమితంగా ఉండాలి.
డయాబెటిస్
నెయ్యి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితమవుతాయి.. ముఖ్యంగా ఇతర కార్బోహైడ్రేట్లతో కలిపి తినేటప్పుడు.. జాగ్రత్తగా ఉండాలి.. డయాబెటిస్ ఉన్న రోగులు నెయ్యి తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.. ఇంకా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది.
జీర్ణ సమస్యలు
ఒక వ్యక్తికి మలబద్ధకం, కడుపు ఉబ్బరం లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు ఉంటే, నెయ్యిని అధికంగా వాడటం వల్ల కడుపు నొప్పి వస్తుంది. నెయ్యి తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.. ముఖ్యంగా భారీ భోజనంతో పాటు తిన్నప్పుడు. కావున ఇలాంటి వారు నెయ్యి విషయంలో జాగ్ర్తతగా ఉండటం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..