Gaddi Chamanthi: చిన్నతనంలో పలకలను శుభ్రం చేయడానికి ఉపయోగించడంతో పలకాకుగా అందరికీ పరిచయమైన గడ్డి చామంతి మొక్క.. ఎక్కడ బడితే అక్కడ విరివిగా కనిపించే ఈ కలుపుజాతి గడ్డి చేమంతి మొక్కలో అనేక ఔషధ గుణాలున్నాయట. ఈ మొక్కల పువ్వులతో ముందు జనరేషన్ వరకూ ఆడుకునేవాడు. సన్నపాటి రేకులతో పసుపు పచ్చని పూలతో అందంగా కనిపిస్తుంది. ఈ మొక్కలో అనేక ఆయుర్వేద గుణాలున్నాయట. ముఖ్యంగా ఆయుర్వేదంతో మనిషి వాత, పిత్త, కఫ సంబంధ రుగ్మతలతో రోగాల బారిన పడతారని విశ్లేషణ. వీటన్నికి మంచి చికిత్స మన ఆయుర్వేదం.. ఒకప్పుడు ప్రాచీన వైద్యం. ఈ ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఉపయోగించే మొక్క గడ్డి చామంతి. దెబ్బ తగిలిన చోట ఏర్పడిన గాయానికి గడ్డి చామంతి ఆకుల రసాన్ని అప్లై చేస్తే .. అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. అంతేకాదు గడ్దిచామంతి అనేక రకాల చర్మ వ్యాధులకు ఈ ఆకు రసం.. ఇప్పటికీ మన దేశంలో అనేక ప్రదేశాల్లో వాడుతూనే ఉన్నాయి. కొన్ని పల్లెటూర్లలోని రైతులు గడ్డి చామంతిని పశువుల గాయాలు, పుండ్లకు వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కను ఎగ్జిమా నివారణకు శక్తిమంతంగా ఉపయోగించవచ్చని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
సాంప్రదాయకంగా గడ్డి చామంతిని శరీరంపై ఏర్పడిన గాయాలను నయం చేయడానికి అనేక రకాల ఉపశమనానికి చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో యాంటీ కోగ్యులెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తాయి.
చర్మ అంటు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారికి దీని ఆకు రసం మంచి ఔషధం. ఇప్పటికీ మనదేశంలోని అనేక గ్రామాల్లో దిమ్మలు, తామర, గజ్జి, బొబ్బలు , గాయాలకు ఈ గడ్డి చామంతిని చికిత్సలో భాగంగా ఉపయోగిస్తున్నారు.
గడ్డి చామంతిలోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నడుము నొప్పి, వెన్ను నొప్పి సమస్యలను నివారిస్తుంది.
గాయం తగిలిన చోట ఈ ఆకు రసాన్ని పిండి కట్టుకడితే నొప్పులు తగ్గిపోతాయి.
ట్రైడాక్స్ ప్రొక్యూంబెన్స్ అనేది జుట్టు పెరుగుదలకు సాంప్రదాయకంగా ఉపయోగించే ఆయుర్వేద ఔషధం.. ఇది భృంగరాజ్ స్థానంలో ఉపయోగించబడుతుంది. రాలిన జుట్టు పెరుగుదలకు గడ్డి చామంతి మంచి సహాయకారి.
ఈ మొక్క కాలేయ రుగ్మతలు, హెపాటోప్రొటెక్షన్, పొట్టలో పుండ్లు, గుండెల్లో మంట కోసం ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.
వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు దోమల వలన వస్తూ ఉంటాయి. ఈ మొక్క క్రిమి వికర్షకంగా పనిచేస్తుంది. దీనిని ఇంటి మధ్యలో ఉంచి లైట్లు ఆపి తలుపుల మూసేస్తే దీని వాసన వలన దోమలు చనిపోతాయి. మిగిలినవి బయటకు వెళ్లిపోతాయి. అంతేకాదు ఈ ఎండిన ఆకులను పొగ వేస్తే క్రిమి కీటకాలు, దోమలు, ఈగలు వంటివి ఇంట్లోకి రావు.
గడ్డిచామంతిలోని ఔషధ విలువలు గురించి అవగాహన లేక కలుపు మొక్క గావించి పీకేస్తుంటారు. ఈ మొక్క అనేక రకాల ఔషధ గుణాలను తనలో దాచుకుంది. ఈ మొక్కకు సాంప్రదాయ ఆయుర్వేద ఔషధంలో ప్రత్యేక స్థానం ఉంది. వీటి ఆకులను ఆకుకూరగా కూడా తింటుంటారు. వీటిని పలక ఆకులు, గడ్డిచామంతి, గాజు తీగ, నల్ల ఆలం వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు.
Also Read: Mixed Vegetable Salad: బరువు తగ్గాలనుకునేవారికి హెల్తీ ఫుడ్.. మిక్సిడ్ వెజిటబుల్ సలాడ్.. తయారీ విధానం ఎలా అంటే