Fruit Side Effects: ఈ రోజుల్లో వేగంగా బరువు తగ్గడానికి కొంతమంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. వ్యాయామాలు కాకుండా ఇష్టమొచ్చిన విధంగా డైట్ ప్లాన్ చేస్తారు. అయితే ఏదైనా పని చేసే ముందు దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. లేదంటే చాలా నష్టం జరుగుతుంది. తప్పు పద్దతిలో బరువు తగ్గాలని చూస్తే శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యంపైనే కాదు చర్మంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. చాలామంది ఫ్రూట్ డైట్ ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం పండ్లపైనే ఆధారపడడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
1. గ్యాస్ ఏర్పడటం
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కట్ చేసిన సిట్రస్ పండ్లను తిన్నా లేదా జ్యూస్ తాగినా అది మీకు హాని కలిగిస్తుంది. ఈ పద్ధతి శరీరానికి మంచిది కాదు. దీనివల్ల శరీరంలో మళ్లీ మళ్లీ గ్యాస్ ఏర్పడే సమస్య ఎదురవుతుంది. మీరు రోజంతా హాయిగా ఉండలేరు. తరచూ బాత్రూమ్ వెళ్లాల్సి ఉంటుంది.
2. అతిసారం
చాలా సార్లు బరువు తగ్గాలనే తపనతో పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా రావొచ్చు. పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. ఇది మాత్రమే కాదు కడుపు నొప్పి, తిమ్మిరి, తలనొప్పి మొదలవుతుంది. విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. శరీరం బలహీనంగా మారుతుంది.
3. మధుమేహం
బరువు తగ్గడానికి ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్‌గా మారే అవకాశాలు ఉంటాయి. పండ్లలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పండ్లలో ఫ్రక్టోజ్ ఉంటుంది. శరీరంలో దాని పరిమాణం పెరగడం మధుమేహానికి కారణమవుతుందని పరిశోధనలో వెల్లడైంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి