Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: తరచూ వాష్‌రూమ్‌కు వెళ్తున్నారా.? మీకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త..

Health: శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్‌లు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లాలంటే మల విసర్జన ఒక్కటే మార్గమనే విషయం తెలిసిందే. అందుకే మలబద్దకం ఉన్న వారిలో అనారోగ్య ససమస్యలు తరచూగా వస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. ప్రేగుల్లో కదలికలు..

Health: తరచూ వాష్‌రూమ్‌కు వెళ్తున్నారా.? మీకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త..
Health
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 15, 2022 | 5:16 PM

Health: శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్‌లు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లాలంటే మల విసర్జన ఒక్కటే మార్గమనే విషయం తెలిసిందే. అందుకే మలబద్దకం ఉన్న వారిలో అనారోగ్య ససమస్యలు తరచూగా వస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. ప్రేగుల్లో కదలికలు సరిగా లేకపోతే రకరకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఎక్కువసార్లు మలవిసర్జనకు వెళ్తున్నా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళ్లే వారిలో గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, టైప్‌-2 డయాబెటిస్‌ ప్రమాదాలకు మద్య సంబంధం ఉందని చైనాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

పెకింగ్ యూనివర్సిటీకి చెందిన కొందరు నిపుణులు చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రోజుకు ఒక్కసారైనా మలవిసర్జన చేయని వారిలో గుండె సమస్యల ప్రమాదాన్ని సూచిస్తుందని, అలాగే వారానికి మూడు కంటే తక్కువసార్లు మలవిసర్జన చేస్తే పక్షవాతం, మూత్రపిండాలు లేదా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అదే విధంగా ఎక్కువసార్లు మల విసర్జనకు వెళ్లినా ప్రమాదమేనని చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 30 నుంచి 79 ఏళ్ల వయసు గల ఐదు లక్షల మంది ఆరోగ్యవంతుల ప్రేగు కదలికలను 10 ఏళ్ల పాటు ట్రాక్ చేసిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు.

అయితే సహజంగా రోజుకు రెండు, మూడు సార్లు మల విసర్జన చేస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమమం అవేంటంటే.. చిన్న చిన్న పనులకే విపరీతమైన అలసటగా ఉండడం. ఒక్కసారిగా బరువు తగ్గడం, నిత్యం కడుపులో నొప్పి లేదా అసౌకర్యంగా ఉండడం. మలంలో రక్తం రావడం లాంటివి కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..