AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: మానవ శరీరంలోనే ప్రత్యేకమైన అవయవం.. దీన్ని నిర్లక్ష్యం చేస్తే డేంజరే..

తిన్నది జీర్ణం కావాలన్నా, రక్తం శుద్ధి కావాలన్నా, గాయాలైనప్పుడు అదే రక్తం గడ్డకట్టాలన్నా.. అన్నింటిని బ్యాలెన్స్ చేసే ఏకైక అవయవం మన కాలేయమే. అదేనండి లివర్. ఇది మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం. శరీరంలోని విష పదార్థాలు బయటకు పంపిస్తూ ఎప్పటికప్పుడు శరీర వ్యవస్థను బాడీగార్డ్ లా కాపాడే వ్యవస్థ ఇది. దీన్ని సరిగ్గా పట్టించుకోకుంటే లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్ వంటివి అటాక్ చేస్తాయి. వాటి నుంచి మీ లివర్ ను ఇలా కాపాడుకోండి.

Health News: మానవ శరీరంలోనే ప్రత్యేకమైన అవయవం.. దీన్ని నిర్లక్ష్యం చేస్తే డేంజరే..
Liver Care
Bhavani
|

Updated on: Feb 11, 2025 | 5:09 PM

Share

లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎంతో మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది. అందుకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ సైలెంట్ కిల్లర్ లా ముంచుకువస్తాయి. మనం అప్రమత్తమయ్యేలోపే శరీరానికి జరగాల్సిన నష్టం జరుగుతుంది. అందుకే లివర్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదంలో కాలేయాన్ని శుద్ధి చేసే ఎన్నో రకాల పద్దతులు ఉన్నాయి. సింపుల్ చిట్కాలతో ఎవరైనా ఈ పనిచేసుకోవచ్చు. సరైన సమయానికి తినకపోవడం, మారుతున్న జీవనశైలి అలవాట్లు, మద్యం, సిగరెట్ వంటి వ్యసనాలు లివర్ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఆయుర్వేదంలో లివర్ సమస్యలకు ఎంతో విలువైన మార్గాలను సూచించారు. అందులో కొన్ని..

ఉసిరికాయ డీటాక్స్..

ఉసిరికాయలో ఉండే ఔషధ గుణాలు లివర్ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడతాయి. ఎంత చెడిపోయిన లివర్ అయినా దాన్ని తిరిగి రిపేర్ చేయగల శక్తి ఉసిరికి ఉంది. లివర్ సెల్స్ ను హెల్తీ గా ఉంచేందుకు ఉసిరిని పొడి రూపంలో గానీ, క్యాండీలు, జ్యూస్ ఇలా ఏ రకంగా అయినా మీ డైట్ లో భాగం చేసుకునేలా ప్లాన్ చేసుకోండి.

అలోవెరాతో అద్భుతాలు..

ఎడారి మొక్కలా కనిపించే అలోవెరాలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం పరిగడుపున ఒక చెంచా అలొవెరా గుజ్జును శుభ్రం చేసి తీసుకోవడం వల్ల మీ లివర్ సేఫ్ జోన్ లో ఉన్నట్టే. లేదా జ్యూసుల్లో కలుపుకున్నా సరే. అయితే, మరీ ఎక్కువ తీసుకోవడం వల్ల విరేచనం అవుతుందని గుర్తుంచుకోవాలి.

పునర్నవతో పునఃవైభవం..

మందు, సిగరెట్ల కారణంగా అప్పటికే దారుణంగా డ్యామేజ్ అయిన లివర్ ను సైతం పునర్నవతో తిరిగి గాఢిలో పొట్టొచ్చు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. షాపుల్లో పునర్నవ పొడి లేదా టానిక్ ల రూపంలో అందుబాటులో ఉంది. దీనిని వైద్యుల సాయంతో తీసుకోవాలి.

ఈ జాగ్రత్తలు పాటించండి..

  • రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగండి. ఇది బాడీలోని వ్యర్థాలను తొలగించి లివర్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • పోషకాలతో కూడిన ఆహారాన్ని డైట్ లో తీసుకోవడం ఎంతో అవసరం. గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పప్పు ధాన్యాలు, ముల్లంగి, క్యారెట్ వంటివి లివర్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఏదో ఒక రూపంలో వీటిని తీసుకునేలా చూడాలి.
  • అన్నింటికన్నా లివర్ ను ఎక్కువగా డ్యామేజ్ చేసేది ఆల్కహాల్ అలవాటు. దీనికి వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలి.
  • రెగ్యులర్ గా చేసే ఎక్సర్ సైజులు కూడా లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో పాటు యోగా, ప్రాణాయామం వంటివి అలవర్చుకోవాలి.
  • మరీ ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేవారిలో లివర్ దెబ్బతింటుంది. దీంతో జీర్ణసమస్యలకు దారి తీస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..