Eye Care Tips: ఈ అలవాట్లు ఉంటే.. మీ నేత్రాలకు మీరే శత్రువు.. వెంటనే కళ్ళు తెరవండి..

|

Jan 06, 2023 | 7:27 PM

ఆరోగ్యం బాగుండాలన్నా? చెడిపోవాలన్నా మన జీవనశైలే కారణం అవుతుంది. సరైన జీవనశైలిని మెయింటెన్ చేస్తే.. ఆరోగ్యంగా పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. కాదని కల్తీ ఆహారాలు, అనారోగ్యకరమైన ఆహారాలు తింటే..

Eye Care Tips: ఈ అలవాట్లు ఉంటే.. మీ నేత్రాలకు మీరే శత్రువు.. వెంటనే కళ్ళు తెరవండి..
Eyesight
Follow us on

ఆరోగ్యం బాగుండాలన్నా? చెడిపోవాలన్నా మన జీవనశైలే కారణం అవుతుంది. సరైన జీవనశైలిని మెయింటెన్ చేస్తే.. ఆరోగ్యంగా పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. కాదని కల్తీ ఆహారాలు, అనారోగ్యకరమైన ఆహారాలు తింటే.. తిప్పలు తప్పవు మరి. దీనికి తోడు మన రోజువారీ అలవాట్లుకూడా ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. అయితే, వీటిలో ఎక్కువ శాతం అలవాట్లు మన కంటిచూపుపైనే ప్రభావం చూపుతాయి. వీటిని ఇలాగే కంటిన్యూ చేస్తే.. కంటి చూపు కోల్పోవడం ఖాయం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాట్లను వెంటనే గుర్తించి, నివారణ చర్యలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదంటున్నారు. మరి కంటి చూపును ప్రభావితం చేసే రోజువారీ 5 బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం..

చాలా మంది టెలివిజన్‌, కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్‌ వంటి స్క్రీన్‌లను ఎక్కువ సమయం చూస్తుంటారు. దీని వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే స్క్రీనింగ్ టైమ్‌ను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ 20/20/20 నియమాన్ని సిఫార్సు చేసింది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుండి దూరంగా చూడాలి. కనీసం 20 సెకన్ల పాటు కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల కంటిపై పడే స్క్రీన్ ఒత్తిడి తగ్గుతుంది.

అధిక ధూమపానం..

ధూమపానం చేయడం వల్ల కంటిలోని ముఖ్యమైన భాగాలు దెబ్బతింటాయి. కంటిలోని కండరాలను పొగ కమ్మేస్తుంది. దీనివల్ల కంటిచూపు మందగిస్తుంది. దృష్టిని తగ్గిస్తుంది. ఒక్కోసారి ఇది కంటి చూపును పూర్తిగా కోల్పోయేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యంపట్ల అశ్రద్ధ..

మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా కంటి చూపుపై ప్రభావం చూపుతాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.. అరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దీర్ఘకాల వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. తద్వారా కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది.

తగినంత నిద్ర, వ్యాయామం లేకపోవడం..

కంటికి సరిపడా నిద్రపోవాలి. సరైన నిద్ర ఉంటే.. ఆటోమాటిక్‌గా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కళ్లు పొడిబారడం, దురద, రక్తం కారడం వంటి సమస్యలు వస్తాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ప్రకారం.. రాత్రి వేళ తగినంత నిద్ర లేకపోతే దాని ప్రభావం కళ్లపై పడుతుంది. కళ్లలో నీళ్లు రావు. పొడిబారుతాయి. సున్నితంగా మారి.. కాంతి పడినప్పుడు ఇబ్బందిగా మారుతుంది. కంటిలో తిమ్మిర్లు, దుస్సంకోచాలు వస్తాయి.

నీరు తాగకపోవడం..

శరీరం హైడ్రేట్‌గా లేకపోతే.. కళ్లు కూడా డీహైడ్రేట్ అవుతాయి. ఇది కంటి చూపుపై ప్రభావం చూపుతుంది. కళ్లలో నీళ్లు రాకపోవడం వల్ల కనుగుడ్లు దురద వస్తుంది. మెల్లమెల్లగా కంటి సమస్యలు పెరుగుతాయి. అస్పష్టమైన దృష్టి, అసౌకర్యం కలుగుతుంది.

ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఇక్కడ ఉంది..

1. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

2. ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

3. జన్యుపరమైన సమస్యలుంటే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

4. ఎండ, వేడిమి నుంచి కళ్లను రక్షించుకోవడానికి సన్ గ్లాసెస్ ధరించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..