AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits: ఇది తింటే క్యాన్సర్‌ వ్యాధిని దూరం చేసుకోవచ్చు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

మన ఆరోగ్యాన్ని మనం తినే ఆహారమే ఎక్కువ శాతం డిసైడ్ చేస్తుంది. ఆరోగ్యాన్ని కోరుకునేవారు తినే తిండే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తింటే బెటర్.. ఏది తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయనేది ముందే తెలుసుకుంటారు. మరికొంతమంది అయితే తప్పకుండా..

Health Benefits: ఇది తింటే క్యాన్సర్‌ వ్యాధిని దూరం చేసుకోవచ్చు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Radishes
Amarnadh Daneti
|

Updated on: Dec 20, 2022 | 8:39 PM

Share

మన ఆరోగ్యాన్ని మనం తినే ఆహారమే ఎక్కువ శాతం డిసైడ్ చేస్తుంది. ఆరోగ్యాన్ని కోరుకునేవారు తినే తిండే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తింటే బెటర్.. ఏది తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయనేది ముందే తెలుసుకుంటారు. మరికొంతమంది అయితే తప్పకుండా డైటీషియన్ల సలహాలు కూడా తీసుకుంటారు. సాధారణంగా మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కూరగాయలు ఎన్నో ఉన్నాయి. అయితే మనకు బ్యాడ్ హ్యాబిట్ గా మారిన మలబద్ధకాన్ని దూరం చేయడానికి కొన్ని కూరగాయలు ఉన్నాయి. వాటిలో ఒకటి ముల్లంగి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో పాటు బద్ధకాన్ని దూరం చేస్తుంది. ముల్లంగి తినడం వల్ల క్యాన్సర్ వ్యాధిని కూడా దూరం చేసుకోవచ్చు. ఏ సీజన్‌లో లభించే కూరగాయలు, పండ్లను ఆ సీజన్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి అన్ని విధాల మేలు కలుగుతుంది. ఈ శీతాకాలంలో ముల్లంగి సమృద్ధిగా లభించే ఒక దుంప కూరగాయ. దీనిని కూరగా వండుకోవచ్చు, సలాడ్, చట్నీ, ఊరగాయ, కోఫ్తా, జ్యూస్ లాగా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా అనేక రూపాల్లో ముల్లంగిని ఆహారంగా తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని మెరుగుపరచ్చే విటమిన్లు ఇందులో ఉన్నాయి. శరీరం నుంచి విషపదార్థాలను తొలగిస్తుంది. ముల్లంగిని దాని ఆకులతో పాటుగా వండుకోవాలి. ఈ ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ బి6, మెగ్నీషియం, భాస్వరం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముల్లంగిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే ముల్లంగి తింటే అది జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.

క్యాన్సర్ నిరోధక లక్షణాలు

క్రూసిఫెరస్ కూరగాయలలో కొన్ని సమ్మేళనాలు ఉంటాయి, ఇవి నీటితో కలిపినప్పుడు ఐసోథియోసైనేట్‌లుగా విభజన చెందుతాయి. ఈ ఐసోథియోసైనేట్‌లు క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాల నుంచి శరీరాన్ని ప్రక్షాళన చేయడంలో దోహదపడతాయి. దీని ద్వారా క్యాన్సర్ కణితి అభివృద్ధిని నిరోధిస్తాయి. ముల్లంగి కూడా క్రూసిఫెరస్ కూరగాయల విభాగంలోకి వస్తుంది. దీనిని తినడం వలన అది క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది.

నియంత్రణలో డయాబెటిస్..

ముల్లంగిలోని శక్తివంతమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అడిపోనెక్టిన్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిల హెచ్చుతగ్గులకు కారకమయ్యే హార్మోన్. ముల్లంగిలో అడిపోనెక్టిన్‌ను నియంత్రించే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. అవి గ్లూకోజ్ హోమియోస్టాసిస్‌ను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

ఇవి కూడా చదవండి

యాంటీహైపెర్టెన్సివ్ ఎఫెక్ట్స్

ముల్లంగిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో, గుండె సక్రమంగా పని చేయడంలో పాత్ర వహిస్తుంది. ఇంకా ముల్లంగిలో ఉండే ఆంథోసైనిన్స్ అనే సమ్మేళనాలు రక్త ప్రసరణను మెరుగుపర్చి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ముల్లంగిని తినడం ద్వారా మలబద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..