AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breakfast: బ్రేక్ ఫాస్టే కదా అని లైట్ తీసుకోకండి.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

భారతదేశంలో ఆహార పదార్థాలు, ఫుడ్ వెరైటీస్ కు కొదవ లేదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోటా రుచికరమైన ఆహారం లభిస్తూనే ఉంటుంది. దేశంలో ఫుడ్ వెరైటీస్ కు ఫేమస్ అయిన ప్రాంతాలెన్నో ఉన్నాయి. సువాసన...

Breakfast: బ్రేక్ ఫాస్టే కదా అని లైట్ తీసుకోకండి.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
Ragi Idli
Ganesh Mudavath
|

Updated on: Oct 09, 2022 | 6:34 PM

Share

భారతదేశంలో ఆహార పదార్థాలు, ఫుడ్ వెరైటీస్ కు కొదవ లేదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోటా రుచికరమైన ఆహారం లభిస్తూనే ఉంటుంది. దేశంలో ఫుడ్ వెరైటీస్ కు ఫేమస్ అయిన ప్రాంతాలెన్నో ఉన్నాయి. సువాసన గల, ఆహ్లాదకరమైన ప్రాంతీయ వంటకాలతో మాత్రమే కాకుండా, పోషకాహారం, ఆరోగ్యకరమైన భోజనమూ లభిస్తుంది. దేశంలో చాలా మంది ప్రజలు దినచర్య ఉదయం టీ, టిఫిన్ తో ప్రారంభమవుతుంది. భారతీయ వంటకాలలో అల్పహారానికి చాలా ప్రాధాన్యత ఉంది. అంతే కాదండోయ్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సౌత్, నార్త్, ఈస్ట్ ఇలా ప్రతి ప్రాంతంలో స్థానికంగా ఏదో ఒక వంట చాలా ఫేమస్. ఉదయం టిఫిన్ చేసి, పనులు ప్రారంభించడం అనేది దేశంలో చాలా కామన్ గా జరిగే చర్య. ఇండియన్ టిఫిన్స్ రుచికరంగానే కాకుండా ఆరోగ్యం పరంగానూ మంచి ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అలాంటి ఐదు రకాల టిఫిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇడ్లీ: రాగి తో చేసిన ఇడ్లీలను అల్పాహారంగా ఉపయోగించవచ్చు. ఇది త్వరగానూ, సులభంగా జీర్ణమవుతాయి. బరువు తగ్గడానికి రాగి అద్భుతమైన పదార్ధం. కిణ్వన ప్రక్రియలో ప్రోటీన్ల జీవ లభ్యతను పెంచుతుంది. కాబట్టి, ఇడ్లీలు ప్రపంచంలోని ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటిగా స్థానం దక్కించుకున్నాయి.

వెజిటబుల్ శాండ్‌విచ్: రెండు గోధుమ రొట్టెల మధ్య కూరగాయలు, పనీర్‌ ఉంచుతారు. ఆరోగ్యకరమైన శాండ్‌విచ్ రోజును ప్రారంభించడానికి అనువైన అల్పాహారం. ఇది మొత్తం గోధుమ రొట్టె, కూరగాయలలో ప్రోటీన్ వంటి వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వెజిటబుల్ శాండ్‌విచ్‌లో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఎందుకంటే దాని తయారీలో అధిక మొత్తంలో కూరగాయలు ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

ఓట్ మీల్: ఓట్ మీల్ ఒక ఆరోగ్యకరమైన అల్పాహారం. ఓట్స్‌లో ఐరన్, బీ విటమిన్లు, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, సెలీనియం ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను కూడా అందిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అభివృద్ధికి సహాయపడుతుంది.

పోహా: భారతదేశంలోని ప్రసిద్ధ బ్రేక్‌ఫాస్ట్‌లలో పోహా ఒకటి. పోహా చేసుకునేటప్పుడు వివిధ రకాల కూరగాయలను యాడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పోహాలో కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫైబర్ ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు అవసరమైన విటమిన్లు గ్లూటెన్ రహితంగా ఉంటుంది.

మూంగ్ దాల్ చీలా: భారతీయ రుకరమైన వంటకాల్లో చీలా కూడా ఒకటి. ఇందులో ప్రొటీన్ ఉంటుంది. మూంగ్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మూంగ్ దాల్ కోలిసిస్టోకినిన్ హార్మోన్ పనితీరును కూడా పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి