Health: భోజనం చేశాక కూడా ఆకలిగా అనిపిస్తుందా.. అలర్ట్ గా ఉండాలని నిపుణుల వార్నింగ్..

శరీరానికి ఆకలి వేయడం సాధారణమైన విషయం. ఆకలిగా ఉన్న సమయంలో ఆహారాన్ని ఎక్కువగా తినేస్తుంటాం. ఆ పరిస్థితుల్లో మన కోరికలను చంపుకోవడం గానీ నియంత్రించుకోవడం గానీ చాలా కష్టం....

Health: భోజనం చేశాక కూడా ఆకలిగా అనిపిస్తుందా.. అలర్ట్ గా ఉండాలని నిపుణుల వార్నింగ్..
Hunger
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 26, 2022 | 10:20 AM

శరీరానికి ఆకలి వేయడం సాధారణమైన విషయం. ఆకలిగా ఉన్న సమయంలో ఆహారాన్ని ఎక్కువగా తినేస్తుంటాం. ఆ పరిస్థితుల్లో మన కోరికలను చంపుకోవడం గానీ నియంత్రించుకోవడం గానీ చాలా కష్టం. శరీరానికి ఎంత ఆహారం అవసరమవుతుందో అంతే మొత్తాన్ని తీసుకోవాలి. చాలా మందికి ఒకే వేళల్లో భోజనం చేయడం అలవాటు. అయితే కొన్ని కారణాల వల్ల వారు సమయానికి ఆహారం తీసుకోకుంటే ఆకలి వేస్తున్న భావన కలుగుతుంది. ఏదైనా తినాలని అనిపిస్తుంటుంది. అదే సమయంలో శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పడిపోతుంటాయి. దీంతో శరీరం మనకు కొన్ని సూచనలు, లక్షణాలను పంపిస్తుంటుంది. ఆకలిగా అనిపిస్తే భోజనం చేయడం సాధారణమే. కొంత మందికి మాత్రం ఆహారం తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఆకలిగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఇలా ఉంటే కచ్చితంగా అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. ఆకలిని నియంత్రించే లెప్టిన్, గ్రెలిన్ హార్మోన్‌లను తిరిగి సెన్సిటైజ్ చేయడం, ఆహారం తీసుకోవడం ద్వారా ఈ ఫీలింగ్ ను తగ్గించుకోవచ్చు. నిత్యం ఇలా చేయడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందవచ్చు.

శరీరానికి అవసరమైనంత వరకే ఆహారాన్ని తీసుకోవాలి. టీవీ చూసుకుంటూ తినడం, పరధ్యానంగా తినడం వంటి అలవాట్లను మానుకోవాలి. ప్రతి రుచిని ఆస్వాదించడానికి, ఆకృతిని అనుభవించడానికి, సువాసనలపై దృష్టి పెట్టడానికి ఆసక్తి చూపించాలి. ఆకలి విషయంలో నిరాశ, ఒత్తిడి, ఆందోళన ప్రధాన పాత్ర పోషిస్తాయి. చాలా మంది ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అతిగా తినడం ప్రారంభిస్తారు. ఇది మున్ముందు మానసకి సమస్యలపై కూడా ఎఫెక్ట్ చూపే ప్రభావం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికంగా ప్రొటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది దీర్ఘ కాలంలో మంచి ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఆకలి కలిగించే హార్మోన్లను తగ్గించడమే కాకుండా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతే కాకుండా విపరీతంగా తినాలన్న కోరిక కలగకుండా చేస్తుంది.

ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమలి మింగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. ఎక్కువసేపు ఆహారాన్ని నమలడం వల్ల శరీరానికి తగినంత సమయం లభిస్తుంది. ఇది పెరుగుదలను పెంచుతుంది. అయితే.. ఆకలిగా అనిపించడం సర్వసాధారణమైన విషయం. అంతే గానీ ఇదేదో పెద్ద సమస్యగా భావించకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణులు సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి